గుంటూరు జిల్లాలో కరోనా పంజా.. 18 గ్రామాలు.. కంటైన్‌మెంట్‌

ABN , First Publish Date - 2020-09-26T17:12:07+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఆయా గ్రా మాలపై అధికారులు దృష్టి సా రించారు. అత్యధికంగా కరోనా కేసు లు నమోదైన గ్రామాల్లో కంటైన్‌ మెంట్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించాలని కలెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో కరోనా పంజా.. 18 గ్రామాలు.. కంటైన్‌మెంట్‌

14 రోజుల పాటు కఠినంగా ఆంక్షలు

గుంటూరు జిల్లాలో కొత్తగా 533 మందికి పాజిటివ్‌


గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఆయా గ్రా మాలపై అధికారులు దృష్టి సా రించారు. అత్యధికంగా కరోనా కేసు లు నమోదైన గ్రామాల్లో కంటైన్‌ మెంట్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించాలని కలెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని 16 మండలాల్లోని 18 గ్రామాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఫిరంగిపురం మండలంలోని గరుడాచలపాలెం, నగరంలోని వెల్లం వారిపాలెం, కారంపూడిలోని మర్రిపాలెం, బాపట్ల లోని బేతపూడి, ము ప్పాళ్లలోని పెదరెడ్డిపాలెం, యడ్లపాడులోని జగ్గా పురం, మాచర్లలో యర్రబాలెం, అచ్చంపేటలో చిగురుపాడు, ఈ పూరులో ఉప్పరపాలెం, క్రోసూరులో ఉయ్యందన, యర్రబాలెం, బాపట్ల లో జిల్లెళ్లమూడి, మంగళగిరిలో బేతపూడి, కొల్లూరులో సుగ్గునలంక, పిడుగురాళ్లలో సంజీవరెడ్డినగర్‌, నరసరావుపేటలో చినతురకపాలెం, రంగారెడ్డిపాలెం, తాడేపల్లి మండలంలోని చిర్రావూ రులను కంటైన్‌మెంట్‌ జోన్లుగా కలెక్టర్‌ ప్రకటించారు. మర్రిపాలెం, పెదరెడ్డిపాలెం, చిగురుపాడు, గరుడాచలంపాలెం, బాపట్లలోని బేతపూడిలో ఎక్కువగా కేసులు ఉన్నందున అక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. 14 రోజుల పాటు ఈ గ్రామాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్‌ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ 24 గంటల వ్యవధిలో పూర్తి చేసి వారికి టెస్టులు చేయిం చాలన్నారు. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ట్రైఏజ్‌ సెంటర్‌కు తీసు కెళ్లి స్ర్కీనింగ్‌ టెస్టులు చేయించాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారిని నిశితంగా గమనించే బాధ్యతలను వలంటీర్‌, ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎంకి కేటాయించాలన్నారు. 


గుంటూరు జిల్లాలో మొత్తం కేసులు 53,935

జిల్లాలో కొత్తగా 533 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అందిన శాంపిల్స్‌ ఫలి తాల్లో ఈ సంఖ్య నమోదైంది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఈ మహ మ్మారి సోకిన వారి సంఖ్య 53,935కి చేరింది. గుంటూరు నగరంలో 70, నరసరావుపేట - 63, కొల్లూరు - 41, మంగళగిరి - 33, సత్తెనపల్లి - 27, తుళ్లూరు - 23, తాడేపల్లి - 19, రెంటచింతల - 18, మాచర్ల - 10, యడ్లపాడు - 18, నకరికల్లు - 19, పొన్నూరు - 19, తెనాలి - 26, చుండూరులో 13 మందికి వైరస్‌ సోకింది. మిగిలిన మండలాల్లో మరో 134 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-09-26T17:12:07+05:30 IST