ముక్కు ద్వారానే మెదడులోకి కరోనా

ABN , First Publish Date - 2020-12-01T07:08:19+05:30 IST

కరోనా వైరస్‌ మన మెదడులోకి ముక్కు రంధ్రాల ద్వారానే ప్రవేశిస్తోంద ని బెర్లిన్‌లోని చరిటే-యూనివర్సిటాట్స్‌ మెడిజిన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది...

ముక్కు ద్వారానే మెదడులోకి కరోనా

బెర్లిన్‌(జర్మనీ), నవంబరు 30: కరోనా వైరస్‌ మన మెదడులోకి ముక్కు రంధ్రాల ద్వారానే ప్రవేశిస్తోంద ని బెర్లిన్‌లోని చరిటే-యూనివర్సిటాట్స్‌ మెడిజిన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. నేచర్‌ న్యూరో సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నా సికా రంధ్రాలు, శ్వాసకోశం ద్వారా వైరస్‌ ప్రయాణిం చి మెదడుకు చేరుతుంది. అత్యంత కీలకమైన కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం వం టి నాడీ సంబంధ సమస్యలు వస్తాయి. మెదడు, అక్కడ ఉండే ద్రవం(సెరెబ్రో స్పానియల్‌), నాడీ వ్య వస్థలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ బయటపడింది. గొంతుతో నాసికా రంధ్రాలు అనుసంధానమయ్యే చోటు వైరస్‌ మొదటి స్థావరమని, అక్కడి నుంచి మెదడుకు చేరుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వైర్‌సకు సహకరించే వాహకాలను గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు.


Updated Date - 2020-12-01T07:08:19+05:30 IST