మత విద్వేషానికి కరోనా సాకు!

ABN , First Publish Date - 2020-04-02T05:43:56+05:30 IST

గురజాడ ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నాడు, చాలా ఆశావాదంతో. కానీ మత చీకటి మేఘాల ముందు జ్ఞానం ఏపాటీ నిలవదని...

మత విద్వేషానికి కరోనా సాకు!

గురజాడ ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నాడు, చాలా ఆశావాదంతో. కానీ మత చీకటి మేఘాల ముందు జ్ఞానం ఏపాటీ నిలవదని ప్రస్తుత పరిస్థితి చెబుతోంది. కాబట్టి మనుషులందరు సమసిపోయే పరిస్థితిలో కూడా ‘‘మతము లన్నియు నిలిచి వెలుగును’’ అనుకోవాలేమో. ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’కు హాజరైన వారిలో కొందరికి కొవిడ్‌–19 వైరస్‌ పాజిటివ్‌ ఉన్నట్టు తేలటంతో కొందరు వివక్షాపూరిత హిందూత్వ వాదులకు ఒక కొత్త ఆయుధం దొరికినట్టు అయింది. బీజేపీ ఐటి సెల్‌ అధ్యక్షుడు దీన్ని ‘ఇస్లా మిక్‌ ఇన్‌సరెక్షన్‌’ (తిరుగుబాటు)గా అభివర్ణించాడు. కొన్ని ప్రధాన సమాచార మాధ్యమాల వ్యాఖ్యాతలు దీన్ని భారత దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రగా అభివర్ణించారు. ఇక సామా జిక మాధ్యమాలలో అయితే విష ప్రచారం కట్టలు తెంచుకుంటోంది. మంగళవారం ట్విట్టర్‌లో ‘కరోనాజిహాద్‌’ అన్నది ట్రెండింగ్‌గా మారింది. ఒక మతంపై వ్యతిరేకతే దేశాన్ని కలిపే ఈ పరిస్థితి విషాదకరం. ఆ సమావేశాలకు చట్టపరమైన అనుమతులు ఉన్నాయా లేవా అన్నది చట్టం పరిధిలోని విషయం. అప్పుడు కూడా అది లాక్‌డౌన్‌ను అతిక్రమించి జరిగిన కొన్ని పార్టీలు, పెళ్ళిళ్ళ కోవలోకి వస్తుందే తప్ప, దేశంపై కుట్రల కోవలోకి రాదు.

పి. శివకుమార్‌, కాకినాడ 

Updated Date - 2020-04-02T05:43:56+05:30 IST