కరోనా.. భయం

ABN , First Publish Date - 2021-04-18T05:09:56+05:30 IST

జనం నిర్లక్ష్యం వీడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైనా తమకు ఏమీ కాదనే ధీమాతో రోడ్లపై తిరిగారు. నాలుగు రోజులుగా పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యల్లో నమోదవడం, మరణాలు పెరగడం వంటి పరిణామాలతో భయం మొదలైంది. అత్యవసరం అనుకుంటేనే ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్ట పడుతున్నారు. కార్మికులు నేరుగా పని ప్రదేశాల్లోనే ఉంటున్నారు. దీంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

కరోనా.. భయం
గొల్లపల్లిలో ఒక్కరోజు స్వచ్ఛంద బంద్‌

- గడప దాటడానికి జంకుతున్న జనం

- వెలవెలబోతున్న దుకాణాలు  

- గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయాలు 

- జిల్లాను చుట్టేసిన కొవిడ్‌ మహమ్మారి 

- 17 రోజుల్లోనే 3113 మందికి పాజిటివ్‌ 

- తాజాగా 443 మందికి పాజిటివ్‌, ముగ్గురు మృతి


(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

జనం నిర్లక్ష్యం వీడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైనా తమకు ఏమీ కాదనే ధీమాతో రోడ్లపై తిరిగారు.  నాలుగు రోజులుగా  పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యల్లో నమోదవడం, మరణాలు పెరగడం వంటి పరిణామాలతో  భయం మొదలైంది. అత్యవసరం అనుకుంటేనే ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్ట పడుతున్నారు. కార్మికులు నేరుగా పని ప్రదేశాల్లోనే ఉంటున్నారు. దీంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. శనివారం సిరిసిల్ల గాంధీచౌక్‌, మార్కెట్‌ ఏరియా, పెద్దబజార్‌, అంబేద్కర్‌ చౌరస్తా ప్రాంతాలతోపాటు దుకాణాల్లోనూ జనం పలుచగానే కనిపించారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపై కనిపించినవారిపై  పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో  జాగ్రత్తలు పాటిస్తున్నారు. 


 తాజాగా 443 మందికి పాజిటివ్‌ 

జిల్లా నలువైపులా కరోనా కేసులు విస్తరించాయి. శనివారం జిల్లాలో  443 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ముగ్గురు మృతి చెం దారు. వేములవాడ రూరల్‌ చెక్కపల్లి మాజీ సర్పంచ్‌ ఏడు రోజుల క్రితం కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స కోసం వెళ్తుండగా మరణిం చారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో మరణించాడు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.  ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో వంద మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 38 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే పలు గ్రామాల్లో వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి అవస్థలు పడుతుప్న సందర్భాలు ఉన్నాయి. 


గతేడాది కంటే వేగంగా..

కరోనా సెకండ్‌ వేవ్‌ గతేడాది కంటే వేగంగా సిరిసిల్ల జిల్లాను చుట్టేసింది. జిల్లా వ్యాప్తంగా  15,432 మంది కొవిడ్‌ బారిన పడగా 12,208 మంది కోలుకున్నారు.  3064 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్క రోజే 416 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. గడిచిన 17 రోజుల్లోనే  3113 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.  జిల్లాలో ఇప్పటివరకు 160 మంది మృతిచెందగా ఈ నెలలో 24 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం  కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహా రాష్ట్రకు రాకపోకలతోనూ వైరస్‌ వ్యాప్తి పెరిగింది.   జిల్లా నుంచి  తీర్థయాత్రలకు వెళ్లివచ్చిన వారిలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు కనిపిస్తున్నాయి. 


వ్యాక్సినేషన్‌కు పోటీ 

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సి నేషన్‌ కోసం పోటీ పడుతున్నారు.  జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టీకాల కార్యక్రమం చేపట్టారు. మొదట్లో టీకాలపై అసక్తి చూపనివారు కూడా ఇప్పుడు ముందు వరుసలోకి వచ్చి వ్యాక్సిన్‌ వేయించు కుంటున్నారు. 


సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు 

కరోనా విస్తరిస్తుండంతో గ్రామాలు సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం ఎల్లారెడ్డి పేట మండలం గొల్లపల్లిలో ఒక్కరోజు స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహిం చారు. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వెంక ట్రావుపేట గ్రామాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. పలు గ్రామాలు కూడా సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి.  

Updated Date - 2021-04-18T05:09:56+05:30 IST