బీజేపీ పాలిత ప్రాంతాల్లో కరోనా భయం

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

బీజేపీ పాలిత ప్రాంతాల్లో కరోనాతో జనం గజగజలాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్‌, వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో కరోనా భయం
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరిన నాయకులతో మంత్రి హరీశ్‌రావు

 నివారణ చర్యల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం

 18 సార్లు పెట్రో ధరలు పెంచింది

 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 15: బీజేపీ పాలిత ప్రాంతాల్లో కరోనాతో జనం గజగజలాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్‌, వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 39 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి గుండు భూపేశ్‌ అని కొనియాడారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యిందని, టీఆర్‌ఎస్‌ అభివృద్ధి చూసి దాదాపు 200 మంది నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరారన్నారు. మిగిలిన పార్టీలు కూడా పట్టణంలో ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రూ.500 పెన్షన్‌, 6 గంటల కరెంట్‌ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.3 వేల పెన్షన్‌, 24 గంటల కరెంట్‌ ఇస్తున్నదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 18 సార్లు పెట్రోల్‌ ధరలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి పేద, మధ్య తరగతి జనాల నడ్డీ విరిచిందన్నారు. కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్‌లో 25 వేల కోట్లు కోత పెట్టిందని, తెలంగాణ నిధుల లేమితో గడ్డుకాలం వెల్లదీసిందని మంత్రి చెప్పారు. బీజేపీ నాయకులపై కేసులు పెడుతూ లోంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST