ఉద్యోగుల్లో కరోనా భయం

ABN , First Publish Date - 2020-09-26T10:57:27+05:30 IST

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోంది. నిత్యం ప్రజలకు సేవ లందించే ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వ్యాధిబారిన పడుతున్నారు. కలెక్టరేట్‌

ఉద్యోగుల్లో కరోనా భయం

వ్యాధిబారిన సుమారు 700 మంది 

వైరస్‌ సోకగానే క్వారంటైన్‌కు

14 రోజుల తర్వాత విధులకు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోంది. నిత్యం ప్రజలకు సేవ లందించే ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వ్యాధిబారిన పడుతున్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ శాఖలతోపాటు బయట ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 700 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఒక హెల్త్‌ అసిస్టెంట్‌తో పాటు విద్యుత్‌శాఖకు చెందిన ఒకరు, మున్సిపల్‌శాఖకు చెందిన ఒకరు మరణిం చారు. సుమారు 40 మందికిపైగా ఉపాధ్యాయులు వ్యాధిబారిన పడ్డట్లు సమా చారం. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడంతో భయం.. భయంగానే కార్యాలయాలకు వస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తూ, శానిటైజర్లను వినియోగిస్తున్నా కరోనా బారిన పడకతప్పడం లేదు. వ్యాధిసోకినట్లు నిర్ధారణ కాగా హోం ఐసోలేషన్‌కు గానీ, హాస్పిటల్‌లో చికిత్సకు గానీ వెళ్లిపోతు న్నారు. 15 రోజులపాటు మందులు వాడుతూ నెగెటివ్‌ రిపోర్టు రాగానే మళ్లీ వచ్చి విధులకు హాజరవుతున్నారు.


ఎవరికైనా వ్యాధిసోకినట్లు నిర్ధార ణ కాగానే ఆయా శాఖకు చెందిన కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేయించి మరుసటి రోజు నుంచి యధావిధిగా పనులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూశాఖలో పలువురు ఉన్నతాధికారులతో పాటు సుమారు 50 మందికిపైగా వ్యాధిబా రినపడ్డట్లు సమాచారం. వ్యాధి ప్రారంభంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేసిన పోలీసుశాఖకు చెందిన 216 మంది కి, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 79 మందికి,  మున్సిపల్‌ సిబ్బంది 40 మందికి కరో నా సోకినట్లు సమాచారం. నిత్యం వైద్య సేవలు అందిస్తూ కరోనా వ్యాధి అరికట్టడానికి తీవ్రంగా కృషిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖలో ఒక డిప్యూటీ డీఎంహెచ్‌తో పాటు తొమ్మిది మంది డాక్టర్లు, ఎనిమిది మంది స్టాఫ్‌నర్సులు, ఎనిమిది ఆశా వర్కర్లు, 11 మంది ఏఎన్‌ఎంలు, 13 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, ముగ్గురు ఫార్మసిస్టులు, ఇద్దరు హెల్త్‌ అసిస్టెంట్లు వీరితో కలుపుకొని మొత్తం 79 మంది వ్యాధిబారిన పడ్డారు. ఎక్సైజ్‌శాఖలో 25 మంది, మద్యం డిపోలో 36 మంది, అగ్నిమాపక శాఖలో 16 మంది, అటవీ శాఖలో ముగ్గురు, విద్యాశాఖలో ముగ్గురు, జిల్లా పంచాయతీ కార్యాలయంలో నలుగురు, జిల్లా సహకారశాఖ కార్యాలయంలో ఆరుగురు, విద్యుత్‌శాఖలో 81 మంది, గిరిజిన సంక్షేమశాఖలో ఆరుగురు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో ము గ్గురు, వ్యవసాయశాఖలో ఇద్దరు, సివిల్‌ సప్లయ్‌లో  ఇద్దరు, ఇరిగేషన్‌ శాఖలో 13 మంది, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీలో 13 మంది,  పోస్టల్‌శాఖలో ఏడుగురు, బ్యాంకింగ్‌ సెక్టార్‌లో 67 మంది, జిల్లా పరిషత్‌ కార్యాల యంలో 13 మందికి వ్యాధి సోకినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు ఇప్పటికే కోలుకొని విధులకు హాజరవుతుండగా మిగతావారు హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


జిల్లాలో కొత్తగా 119 మందికి పాజిటివ్‌ : 

జిల్లాలో శుక్రవారం 119 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా దాదా పు 280 మంది వరకు వ్యాధిబారిన పడ్డారు. జిల్లాలోని ఇల్లందకుంట మండ లంలో 9, చిగురుమామిడి మండలంలో 8, సైదాపూర్‌ మండలంలో 2, తిమ్మా పూర్‌ మండలంలో 13, చొప్పదండి మండలంలో 10, గంగాధర మండలంలో 7, శంకరపట్నం మండలంలో 7, రామడుగు మండలంలో 4, వీణవంక మండలంలో 3, గన్నేరువరం మండలంలో 2, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 3, కొత్తపల్లి మండలంలో 10, మానకొండూర్‌ మండలంలో 9,  హుజురాబాద్‌లో 25 ,   జమ్మి కుంట మండలంలో 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కరీంనగర్‌ పట్టణంలోని కట్టరాంపూర్‌లో ఒకరికి, భగత్‌నగర్‌లో ముగ్గురికి, తిరుమల్‌నగర్‌లో ఒకరికి, రేకుర్తిలో నలుగురికి, సీతారాంపూర్‌లో ఐదుగురికి, సాయినగర్‌లో ఒకరికి, కాపువాడలో ఒకరికి, విద్యానగర్‌లో నలుగురికి, సంతోష్‌ నగర్‌లో ముగ్గురికి, శివాజీనగర్‌లో ఇద్దరికి, కిసాన్‌నగర్‌లో ఇద్దరికి, శ్రీనగర్‌ కాలనీలో ఇద్దరికి కరోనా వ్యాధి సోకినట్లు తెలిసింది. ఇవే కాకుండా చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ చేయించుకొని వైద్యుల సూచన మేరకు హాస్పి టల్స్‌, హోం క్వారంటైన్‌లో ఉండి మందులు వాడుతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యా ప్తంగా దాదాపు 280 మంది వరకు వ్యాధిబారిన పడ్డట్లు స్థానికుల సమాచారం మేరకు తెలిసింది. 

Updated Date - 2020-09-26T10:57:27+05:30 IST