113 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-07-15T10:55:34+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం..

113 మందికి కరోనా

2128కి చేరుకున్న బాధితుల సంఖ్య


కడప, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మరో 113 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 2128కి చేరుకుంది. కడపలోని అక్కాయపల్లె, ఎన్జీవో కాలనీ, మారుతీనగర్‌, అంబాభవానీనగర్‌, మాసాపేట్‌, విజయదుర్గాకాలనీ, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, మృత్యుంజయకుంట, శంకరాపురం, బెల్లంమండీవీధి, ఆర్‌కే నగర్‌, మేదరవీధి, బళ్లారిరోడ్డు, సింగపూర్‌ టౌన్‌షి్‌ప, రవీంద్రనగర్‌, చిన్నచౌకు, మున్సిపల్‌ ఆఫీసు రోడ్డు, శాస్త్రినగర్‌, రాజారెడ్డివీధుల్లో 73 కేసులు నమోదయ్యాయి.


పులివెందులలో 5, చెన్నూరు 5, ప్రొద్దుటూరు 3, సీకేదిన్నె 4, కమలాపురం, రైల్వేకోడూరు, తొండూరు, బికోడూరు, సింహాద్రిపురంలలో రెండు రెండు చొప్పున, జమ్మలమడుగు, వేంపల్లె, రాయచోటి, చాపాడు, రాజంపేట, ఎర్రగుంట్ల, చిన్నమండ్యం, లింగాల, గోపవరం, దువ్వూరు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా లక్షణాలు బయటపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.


59 మంది డిశ్చార్జి

కోవిడ్‌-19 బారిన పడి చికిత్స పొంది సంపూర్ణంగా కోలుకున్న 59 మంది ని మంగళవారం ఫాతిమా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి దాకా 1166 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు.

Updated Date - 2020-07-15T10:55:34+05:30 IST