మరో 127 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-18T06:09:58+05:30 IST

జిల్లాలో కరోనావైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్తగా పాజిటివ్‌

మరో 127 మందికి కరోనా

జిల్లా ఆస్పత్రిలో ఒకరు.. గాంధీలో ఒకరు మృతి 

కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి


కరీంనగర్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కరోనావైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతోపాటు వృద్ధులు వ్యాధిబారిన పడి చనిపోతున్నారు. దీనితో జిల్లాప్రజలు తీవ్రభయాందో ళనకు గురవుతున్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బుధవారం జిల్లాలో 127మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు తన బులిటెన్‌లో వెల్లడించింది. గురువారం కూడా దాదాపు 300లకుపైగానే పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు స్థాని కులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తున్నది. కరీంన గర్‌ పట్టణంలోని వావిలాలపల్లికి చెందిన 65ఏళ్ళ వృద్ధుడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ బారినపడి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అలాగే కరీంనగర్‌రూరల్‌ మండలం చర్లభూ త్కూర్‌ గ్రామానికి చెందిన 40ఏళ్ళ వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయనను చికిత్సకోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.


గురువారం ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదిలా ఉంటే గురువారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో సగటున 10నుంచి 15శాతం మేరకు కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. హుజురా బాద్‌ మండలంలో 25మందికి, జమ్మికుంట మండలంలో 28, ఇల్లందకుంట మండలంలో9, సైదాపూర్‌ మండలంలో ముగ్గురికి, వీణవంక మండలంలో ఏడుగురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇక కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చిగురుమామిడి మండలంలో నలుగురు, తిమ్మాపూర్‌  మండలంలో 18, చొప్పదండి మండలంలో 17, గంగాధర మండలంలో ఇద్దరు, రామడుగు మండలంలో తొమ్మిది, కొత్తపల్లి మండలంలో 13, మానకొండూర్‌ మండలంలో 11 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. 


కరీంనగర్‌ పట్టణంలోని విద్యానగర్‌లో ఇద్దరికి, భాగ్యన గర్‌లో ఒకరికి, మంకమ్మతోటలో ఇద్దరికి, అశోక్‌నగర్‌లో నలుగురికి, రాఘవేంద్రనగర్‌లో ఇద్దరికి, పద్మశాలి వీధిలో ఒకరికి, లక్ష్మీనగర్‌లో ఇద్దరికి, బోయవాడలో ఇద్దరికి, హౌసింగ్‌ బోర్డుకాలనీలో ఇద్దరికి వ్యాధినిర్ధారణ అయింది. అలాగే తీగలగుట్టపల్లిలో ముగ్గురు, గణేశ్‌నగర్‌లో నలు గురు, కట్టరాంపూర్‌లో 12మంది, భగత్‌నగర్‌లో ఐదు గురు, రేకుర్తిలో నలుగురు, ఆరెపల్లిలో ఒకరు వ్యాధి బారినపడ్డారు. సుభాష్‌నగర్‌లో నలుగురికి, వావిలాల పల్లిలో ముగ్గురికి, శివాజీనగర్‌లో ఒకరికి, క్రిస్టియన్‌ కాలనీలో ఒకరికి, కిసాన్‌నగర్‌లో ఒకరికి, శ్రీనగర్‌కాలనీలో ఒకరికి, కాశ్మీరుగడ్డలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చాలా మంది ప్రైవేట్‌ ఆస్పత్రులు, ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో సీటీస్కాన్‌ చేసుకొని కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు తేలితే డాక్టర్ల సూచన మేరకు హోంఐసోలేష న్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-09-18T06:09:58+05:30 IST