మరో 180మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-14T10:09:20+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం మరో 180మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణైంది. ఇరుజిల్లాల్లోని వైద్యఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో

మరో 180మందికి కరోనా

ఖమ్మం జిల్లాలో 91, భద్రాద్రిలో 51మందికి లక్షణాలు

సింగరేణి ఐదు ఏరియాల్లో 38కేసులు 


(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్‌)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం మరో 180మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణైంది. ఇరుజిల్లాల్లోని వైద్యఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 140మందికి.. ఉమ్మడిజిల్లాలోని సింగరేణి ఐదు ఏరియాల్లోని ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 38మందికి.. మొత్తం 180మందికి లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 330 మందికి పరీక్షలు చేయగా.. 91మందికి  పాజిటివ్‌ వచ్చింది. గతంలో కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో మరో 103మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. సత్తుపల్లిలో 13మందికి, పెనుబల్లి మండలంలో ఎనిమిది మందికి, కల్లూరులో ఒకరికి, వేంసూరులో ఇద్దరికి, బోనకల్‌ మండలంలో ముగ్గురికి, మధిర మండలంలో ఎనిమిది మందికి, ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడులో ఒకరికి, వైరాలో ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 50మంది కొవిడ్‌ బారిన పడ్డారు.


ఇక వేంసూరు మండలం పల్లెవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(56) కరోనా లక్షణాలతో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైద్యఆరోగ్య శాఖ ఆసుపత్రుల్లో జరిపిన పరీక్షల్లో 51మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అయితే ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలోని ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు సజావుగా సాగలేదు. దీంతో పాజిటివ్‌ కేసులు కూడా తక్కువగా నమోదయ్యాయి. జిల్లాలోని పీహెచ్‌సీలనుంచి అందిన సమాచారం ప్రకారం అశ్వారావుపేట మండలంలో నలుగురికి, దమ్మపేటలో నలుగురికి, కొత్తగూడెంలో ఐదుగురికి, భద్రాచలంలో 21 మందికి, చర్లలో ఆరుగురికి, ఇల్లెందులో ఎనిమిదిమందికి, టేకులపల్లి మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


సింగరేణి ఆసుపత్రుల్లో 38 నమోదు..

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని సింగరేణి ఏరియాల్లోని కంపెనీ ఆసుపత్రుల్లో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 385మందికి పరీక్షలు చేయగా కార్పొరేట్‌ ఆసుపత్రిలో 18మందికి, కొత్తగూడెం ఏరియాలో ఇద్దరికి, ఇల్లెందులో నలుగురికి, మణుగూరులో 11మందికి, సత్తుపల్లిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణైంది. 

Updated Date - 2020-08-14T10:09:20+05:30 IST