మరో 64 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-13T10:28:34+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం 64 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

మరో 64 మందికి కరోనా

ముగ్గురు మృతి 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం 64 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన 63 సంవత్సరాల వృద్దుడు, టవర్‌సర్కిల్‌ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ళ వృద్దురాలు కరోనా వ్యాధి బారిన పడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.  మానకొండూర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం కరోనా బారిన పడ్డ వారి సంఖ్య భారీగానే ఉంది.


హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో 102 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో 20మందికి వ్యాధి నిర్ధారణ అయింది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో 57 మందికి యాంటీజన్‌ రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 8 మందికి వైరస్‌ సోకింది. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇల్లందకుంట మండలంలో ఇద్దరు, శంకరపట్నం మండలంలో ఒకరు, వీణవంక మండలంలో ముగ్గురికి, సైదాపూర్‌లో ఒకరికి కరోనా వ్యాధి సోకింది. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ఆరుగురు, కొత్తపల్లి మండలంలో ఐదుగురు,  చొప్పదండిలో 10 మంది,  గంగాధర మండలంలో ముగ్గురు, రామడుగులో ముగ్గురు కరోనా బారిన పడ్డట్లు తెలిసింది.


కరీంనగర్‌  జ్యోతినగర్‌లో ఒకరికి, రాంనగర్‌లో ఒకరికి, గణేశ్‌నగర్‌లో ఒకరికి, కట్టారాంపూర్‌లో ఆరుగురికి, భగత్‌నగర్‌లో ముగ్గురికి, సాలెహ్‌నగర్‌లో ముగ్గురికి, సీతారాంపూర్‌లో ఒకరికి, శర్మనగర్‌లో ఇద్దరికి, బ్యాంకు కాలనీలో ఒకరికి, వావిలాలపల్లిలో ఒకరికి, బోయివాడలో ఒకరికి కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం. మరికొంత మంది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోగా వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది. 


చొప్పదండిలో కలకలం

చొప్పదండి: పట్టణంలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 26 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మంది పాజిటివ్‌గా తేలింది. ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ రాగా మరోచోట దంపతులకు పాజిటివ్‌ వచ్చింది. 


కొనసాగుతున్న థర్మల్‌ స్ర్కీనింగ్‌

హుజూరాబాద్‌ రూరల్‌: కరోనా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది బుధవారం పర్యటించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో జూవేరియా తెలిపారు. హుజూరాబాద్‌, చెల్పూర్‌, వావిలాల పీహెచ్‌సీ పరిధిలో 2,093 మందికి స్ర్కీనింగ్‌  నిర్వహించారన్నారు.

Updated Date - 2020-08-13T10:28:34+05:30 IST