కుక్కలు, పిల్లులకూ కరోనా !

ABN , First Publish Date - 2021-06-22T09:27:40+05:30 IST

జంతు ప్రదర్శనశాలల్లోని పులులు, సింహాలు, చిరుత లు, ఎలుకబంట్లతో పాటు పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, కుందేళ్లకు కూడా కరోనా సోకే ముప్పు ఉందని హైదరాబాద్‌లోని లేబొరేటరీ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేజర్డ్‌ స్పెసీస్‌ (లాకోన్స్‌) సంస్థ వెల్లడించింది.

కుక్కలు, పిల్లులకూ కరోనా !

  • వాటి నుంచి మనుషులకు సోకదు
  • జంతువులకు కొవిడ్‌-19 పరీక్షలపై 
  • మార్గదర్శకాలు :‘లాకోన్స్‌ - సీసీఎంబీ’


జంతు ప్రదర్శనశాలల్లోని పులులు, సింహాలు, చిరుత లు, ఎలుకబంట్లతో పాటు పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, కుందేళ్లకు కూడా కరోనా సోకే ముప్పు ఉందని హైదరాబాద్‌లోని లేబొరేటరీ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేజర్డ్‌ స్పెసీస్‌ (లాకోన్స్‌) సంస్థ వెల్లడించింది. అయితే ఆ జంతువుల నుంచి వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం లేదని స్పష్టంచేసింది. జూలోని జంతువులకు ఆకలి తగ్గినా, శ్వాసపరమైన సమస్యలు తలెత్తినా, జ్వరం, తుమ్ములు వచ్చినా కరోనా పరీక్షలు చేయించాలని ఆ సంస్థ సూచించింది. జంతువుల నుంచి నమూనాలను ఎలా సేకరించాలి ? ఎలా ప్యాక్‌ చేయాలి ? ఇన్ఫెక్షన్‌ సోకిన జంతువులను ఎలా ఐసొలేషన్‌లో ఉంచాలి ? అనే అంశాలపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన లాకోన్స్‌ సంస్థ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉండటంతో గత ఏడాది ఆగస్టు నుంచే లాకోన్స్‌ వాటి నమూనాలను పరీక్షిస్తోంది. దీనితో పాటు మరో మూడు జాతీయ సంస్థలు కూడా ఈ టెస్టులు చేస్తున్నాయి. 

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-06-22T09:27:40+05:30 IST