Abn logo
Sep 19 2021 @ 00:29AM

ప్రాదేశిక అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు కరోనా

‘పేటలో 28 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ


పాయకరావుపేట, సెప్టెంబరు 18: పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే వివిధ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లకు (90 మంది) కరోనా పరీక్షలు (ఆర్టీపీసీఆర్‌) నిర్వహించగా 28 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు పాయకరావుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి మాత్రమే కౌంటింగ్‌ పాస్‌లు ఇస్తామని, పాజిటివ్‌ వచ్చినవారి స్థానంలో వేరేవారి పేర్లు ఇవ్వాలని, వారికి కూడా ఆర్టీపీసీఆర్‌ నిర్వహించి నెగెటివ్‌ వస్తేనే పాస్‌లు ఇస్తామని స్పష్టం చేశారు.


జిల్లాఓ మరో 55  పాజిటివ్‌ కేసులు

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 55 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసులు 1,56,616కు చేరాయి. వీరిలో 1,54,486 మంది వైరస్‌ నుంచి బయటపడగా, 1,048 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాలు 1,082కు చేరాయి.