రామచంద్రాపురంలో ఒకరికి కరోనా

ABN , First Publish Date - 2020-05-24T10:12:08+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రామచంద్రాపురంలో ఒకరికి కరోనా

వివరాలు సేకరిస్తున్న పోలీసులు, రెవెన్యూ, వైద్య అధికారులు


చారకొండ, మే 23 : నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కరోనా వచ్చిన వ్యక్తి ఈ నెల 16 తన అత్త ఊరైన డిండి మండలం రామంతపూర్‌ గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఒడి బియ్యం పోసుకొని, మళ్లీ తిరిగి సొంతూరికి చేరుకున్నాడు. 18న గ్రామంలోని చుట్టాలను పిలుచుకొని ఫంక్షన్‌ చేశాడు. అంతకుముందు 16ప చారకొండలోని ఓ బట్టల దుకాణంలో బట్టలు కొనుగోలు చేశాడు. అయితే గత బుధవారం అనారోగ్యానికి గురి కావడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా లక్షణాలు ఉండటంతో, అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలడంతో శనివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌,  డీఎస్పీ గిరిబాబు, వెల్దండ సీఐ నాగరాజు, తహసీల్దార్‌ నాగమణి, వైద్యాధికారిణి రూపలు రామచంద్రాపురం గ్రామాన్ని సందర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, గ్రామంలో ఒకరికి కరోనా రావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Updated Date - 2020-05-24T10:12:08+05:30 IST