అనంతపురం జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-22T01:12:22+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా

అనంతపురం జిల్లాలో కరోనా కలకలం

అనంతపురం: జిల్లాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 135 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్క రోజే 40 కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సందడి సాగుతోంది. పిల్లలు కరోనా నియంత్రణ, నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం కూడా ఆ మేరకు అవసరమైన నిధులు, మెటీరియల్‌ ఇవ్వడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్‌ వేగంగా మళ్లీ ప్రభావం చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా కరోనా ప్రభావం తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ జనంలో టెన్షన్‌ మొదలైంది. స్వీయరక్షణతోనే కరోనాను దూరం చేయవచ్చన్న అభిప్రాయాలున్నాయి. తప్పనిసరిగా మాస్కులు ధరించటం, అత్యవసర పనులు ఉంటేనే బయట తిరగటం చేయాలని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-22T01:12:22+05:30 IST