కరోనా ఫోర్త్ వేవ్ ముప్పులో కెనడా... డెల్టా వేరియంటే కారణం!

ABN , First Publish Date - 2021-08-01T12:38:36+05:30 IST

కెనాడాలో కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు కనిపిస్తోంది.

కరోనా ఫోర్త్ వేవ్ ముప్పులో కెనడా... డెల్టా వేరియంటే కారణం!

ఒట్టావా: కెనాడాలో కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు కనిపిస్తోంది. దేశ ప్రధాన ప్రజారోగ్య అధికారి డాక్టర్ థెరీసా టామ్ మాట్లాడుతూ కెనడాలో మహమ్మారి ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి డెల్టా వేరియంటే కారణం. దీనికితోడు దేశంలో ఆంక్షలను త్వరగా ఎత్తివేయడం పాటు వ్యాక్సినేషన్‌లో జాప్యం జరుగుతున్నదన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగితే, ఆసుపత్రులలో చేరే బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు. దేశంలో యువతకు వ్యాక్సిన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదని, దీనిని వేగవంతం చేయనున్నామన్నారు. దేశంలోని 63 లక్షల మందికి ఇప్పటివరకూ తొలి డోసు టీకా వేయడం జరిగిందని, 50 లక్షల మందికి రెండవ డోసు టీకా వేయాల్సివున్నదన్నారు.



Updated Date - 2021-08-01T12:38:36+05:30 IST