కుక్కలు, పిల్లులు ప్రేమను పంచుతాయి

ABN , First Publish Date - 2020-04-09T08:42:11+05:30 IST

కుక్కలు, పిల్లులు ప్రేమను పంచుతాయేతప్ప.. అవి కరోనా వైరస్‌ వ్యాపకాలు కాదని జంతుప్రేమికులు అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లోని ఓ జూపార్క్‌లో పులికి కరోనా సోకిన నేపథ్యంలో...

కుక్కలు, పిల్లులు ప్రేమను పంచుతాయి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: కుక్కలు, పిల్లులు ప్రేమను పంచుతాయేతప్ప.. అవి కరోనా వైరస్‌ వ్యాపకాలు కాదని జంతుప్రేమికులు అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లోని ఓ జూపార్క్‌లో పులికి కరోనా సోకిన నేపథ్యంలో.. జంతువుల వల్ల కరోనా వస్తుందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు మేనకా గాంధీ అన్నారు.


ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. కుక్కలు, పిల్లులు కరోనా వ్యాపకాలు కాదని.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాటికి ఆహారాన్ని అందించాలని రెజ్లర్‌ సంగ్రామ్‌ సింగ్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు సందేశాలతో కొందరు కుక్కలు, పిల్లులను చంపుతున్నారని ఆయన ఓ వీడియో మెసేజ్‌లో వాపోయారు. బాత్రా పాజిటివ్‌ క్లినిక్‌ అధినేత ముఖేశ్‌ బాత్రా ఇదే అభిప్రాయం తెలిపారు. కరోనాలాంటి వైర్‌సలు పెంపుడు పిల్లులు, కుక్కల నుంచి వ్యాప్తి చెందబోదని తెలిపారు.

Updated Date - 2020-04-09T08:42:11+05:30 IST