కరోనా ఆర్థిక సహాయంపై అయోమయం

ABN , First Publish Date - 2020-04-09T12:28:50+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఆయోమయంలో ఉన్నాయి.

కరోనా ఆర్థిక సహాయంపై అయోమయం

వీరవాసరం / మొగల్తూరు, ఏప్రిల్‌ 8: ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆర్థిక సహాయం అందని కుటుంబాలు ఆయోమయంలో ఉన్నాయి. ఈ నెల 4న కరోనా ఆర్థిక సహాయంగా రూ.వెయ్యి నగదును వలంటీర్ల ద్వారా అందజేశారు. పలు కుటుంబాలకు ఇంకా నగదు సాయం అందలేదు. వీరవాసరం మండలంలో సుమారు 21 వేల బియ్యం కార్డులు ఉండగా 19,387 మందికే మంజూర య్యాయి. వలంటీర్లు వారికి ఏర్పాటుచేసిన యాప్‌లో అనుసంధానమైన పేర్లకు మాత్రమే సహాయం అందుతుందని చెబుతున్నారు. ఉచిత బియ్యం అందిన కుటుంబాలు అన్నింటికీ  సహాయం అందలేదు.


మొగల్తూరు మండలంలో పలువురు పేదలకు పొలం లేకున్నా మూడెకరాలు పైబడి ఉందని, ఇన్‌కం ట్యాక్స్‌ కడుతున్నారని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని నగదు సాయం అందించలేదు.

Updated Date - 2020-04-09T12:28:50+05:30 IST