పైపైకి..

ABN , First Publish Date - 2022-01-25T06:26:21+05:30 IST

నగరం, పట్ట ణం, పల్లె అనే తేడా లేకుండా కరోనా విరుచుకుపడు తోంది. గడిచిన 24 గంటల్లోనే 1610 కరోనా కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు సోమవారం తెలిపారు. రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల్లో రెండో స్థానంలో నిలిచింది.

పైపైకి..

విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌

ఒక్కరోజులో 1610 కేసులు

ల్యాబ్‌లో వేలాదిగా శాంపిళ్ల పెండింగ్‌

టెస్టింగ్‌లు చేసినా ఫలితాలు ఆలస్యం

సాంకేతిక సమస్యే అంటున్న యంత్రాంగం

శాంపిళ్ల సేకరణకు ఆంక్షలు

వందలాది మంది సెంటర్ల 

నుంచి వెనక్కు

అనంతపురం వైద్యం, జనవరి24: నగరం, పట్ట ణం, పల్లె అనే తేడా లేకుండా కరోనా విరుచుకుపడు తోంది. గడిచిన 24 గంటల్లోనే 1610 కరోనా కేసులు జిల్లాలో నమోదైనట్టు అధికారులు సోమవారం తెలిపారు. రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జిల్లాలో 168267 మంది కరోనా బారిన పడగా ఇందులో 159620 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం 7554 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


శాంపిళ్లు, టెస్టింగ్‌ ఫలితాలపై అయోమయం

జిల్లాలో కరోనా పంజా విసురుతున్నా అధికార యం త్రాంగం నియంత్రణపై పెద్దగా దృష్టి సారించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా జనం జ్వరాలు, జలుబు, వొళ్ళు నొప్పులతో విలవిల్లాడుతున్నారు. వారికి పరీక్ష నిర్వహిస్తే తప్పనిసరిగ్గా కరోనా పాజిటివ్‌ వస్తుందని వైద్య వర్గాలే చెబుతున్నాయి. అయితే శాంపిళ్ల సేకరణ విషయంలో ఇప్పటికీ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. గత రెండు విడతలలో రోజుకు 12 వేల నుంచి 20వేల వరకు శాంపిళ్లు తీసేవారు. ప్రస్తుతం ఐదారువేలు మాత్రమే తీస్తున్నారు. అది కూడా ఏ రోజు శాంపిళ్లు ఆరోజు ల్యాబ్‌లలో టెస్టింగ్‌లు చేయడం లేదు. టెస్టింగ్‌లు చేసినా ఫలితాలు చెప్పడం లేదు. దాదాపు జిల్లా ల్యాబ్‌లో 4వేల శాంపిళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 3వేల వరకు టెస్టింగ్‌లు పూర్తి చేసినా ఫలితాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. ల్యాబ్‌లో సిబ్బంది ఎక్కు వ మంది కరోనా బారిన పడటంతో పరీక్షల నిర్వహణ చేయలేకపోతున్నట్లు సమాచారం. రోజుకు 3 వేల నుంచి 4వేల వరకు  టెస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది టెస్టింగ్‌  ఫలితాలు పంపాలంటే పోర్టల్‌లో నమోదు చేయాల్సి  ఉంటుంది. గత వారం రోజులుగా సాంకేతిక సమస్యతో పోర్టల్‌ పనిచేయడం లేదని దీంతో డేటా ఎంట్రీ చేయడా నికి ఇబ్బందులు కలుగుతున్నాయని ల్యాబ్‌ వర్గాలు చెబు తున్నాయి.  దీంతో శాంపిళ్లు ఇచ్చిన వారు తమకు పాజిటి వా, నెగిటివా అని తెలియక ఆందోళనతో  ఎదురు చూడా ల్సి వస్తోంది. మరోవైపు శాంపిళ్లు ఎక్కువగా తీస్తుండ టంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని  ఉన్నతాధి కారులు శాంపిళ్లపై ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు విని పిస్తున్నాయి. అందుకే సోమవారం శాంపిళ్లు ఇవ్వటానికి జిల్లా ఆస్పత్రికి పెద్దఎత్తున బాధితులు తరలివచ్చినా వీటీఎమ్స్‌ లేవని  వెనక్కి పంపించారు. కొందరికైౖతే మీ ప్రాంతాల్లోనే శాంపిళ్లు ఇచ్చుకోవాలని అక్కడున్న సిబ్బంది హుకుం జారీ చేసి పంపించారు. ఇదంతా శాంపిళ్లు తగ్గించడానికేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


మొదలైన కరోనా మరణాలు

జిల్లాలో కరోనా మరణాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కేసులు మాత్రమే అధికారులు చూపుతూ వచ్చారు. మరణాలు సంభవించడం లేదని వైర్‌సకు భయపడకుం డా ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నా రు. అయితే థర్డ్‌ వేవ్‌లో మరణాలు మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది. గుంతకల్లు మండలం పాత కొత్త చెరువుకు చెందిన వలంటీర్‌ జగదీశ సోమవారం కరోనాతో మరణించారు. ఆయనకు నాలుగు రోజుల కిందట గుంతకల్లు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వెళ్తుండగా మరిణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకోవైపు జిల్లా ఆస్పత్రిలో వృద్ధుడు మరణించారు. పెనుకొండకు చెందిన సురేంద్రరావు జిల్లా ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. మరణాలు జరిగినా అధికారు లు చూపకపోవడం గమనార్హం.


తపాలా శాఖలో కరోనా కలకలం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి24: తపాలాశాఖ ను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ శాఖ హిందూ పురం, అనంతపురం డివిజన్లలోని పలు పోస్టాఫీసుల్లో ప దుల సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఈక్ర మంలో ఎప్పుడు ఎవరికి వైరస్‌ సోకుతుందోననే భయంతో ఆ శాఖ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది  వైరస్‌ విజృంభనతో తపాలాశాఖలో పలువురు పో స్టుమా స్టర్లు, పోస్టుమెన్లు, ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. గతా న్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోకపోవ టంపై పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు. హిం దూపురం డివిజనలోని పలు ఎస్‌ఓ, బీఓలలో విధులు ని ర్వహిస్తున్న పోస్టుమెన్లు, పీఏ కేడర్లలో ఉన్న దాదాపు 20 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు సమాచారం. అనం తపురం డివిజన పరిధిలో 30 మంది వరకూ వైరస్‌ బారి నపడినట్లు తెలుస్తోంది. వీరంతా ఎవరెవరితో కాంటాక్ట్‌ అ య్యారో తెలియని స్థితి. అదే ఇప్పుడు ఆశాఖ ఉద్యోగులను కలవరపెడుతోంది. 


ప్రధాన తపాలా కార్యాలయంలో నలుగురు పీఏ కేడర్‌ ఉద్యోగులకు...

జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో కరోనా కోరలు చాస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతం కావ డంతో ఎవరు లోపలికి వస్తున్నారో వారిలో ఎవరికి కరో నా సోకిందో తెలియని స్థితి. ఈ నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పీఏ కేడర్‌ ఉద్యోగులు తాజాగా కరోనా బారిన పడ్డారు. దీంతో మిగతా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఆ శాఖ ఉన్నతాధికారులు మా త్రం ఇంతవరకూ ఆ విభాగంలో శానిటైజ్‌ చేయించిన పాపాన పోలేదు. గతేడాది కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ మా స్కులు, శానిటైజర్లు, హెల్మెట్‌లను పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పె రుగుతున్నా ఆ శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


పోస్టుమెన్ల పరిస్థితి దారుణం

ఇంటింటికి తిరిగి తపాలా సేవలందించే పోస్టుమెన్ల పరిస్థితి దారుణంగా మారింది. ఫీల్డ్‌ వర్క్‌ కావడంతో రోజు వందల సంఖ్యలో పోస్టులు ఇవ్వాల్సి వస్తుండటం.. ప్రతి ఇంటి తలుపు తట్టిమరి ఇస్తున్న నేపథ్యంలో పలు వురు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రెండు డివిజన్లలో కలిపి 20 మందికిపైగానే కరోనా బారిన పడి నట్లు సమాచారం. వీరందరూ తమకు రక్షక హెల్మెట్‌లు, శానిటైజర్‌లు, మాస్కులు ఇవ్వాలని కోరినప్పటికీ ఆ శాఖ అధికారుల నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కనిపించని కరోనా నిబంధనలు...

జిల్లాలోని ఏ పోస్టాఫీసులో చూసినా భౌతికదూరం బహుదూరంగా కనిపిస్తోంది.  కౌంటర్లు నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, గుంపులుగుంపులుగా కౌంటర్ల వద్ద నగదు లావాదేవీలు జరుపుతుండటం కనిపిస్తోంది. జిల్లాలోని పలు పోస్టాఫీసుల్లో నో మాస్క్‌... నో ఎంట్రీ బోర్డు కనిపించడం లేదంటే పరిస్థితులు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు.


వైద్యులపై వైరస్‌ పంజా

అనంతపురం వైద్యం, జనవరి 24: కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బందిపైనా వైరస్‌ పంజా విసురుతోంది. జిల్లా కేంద్రంలోని బోధనాస్పత్రిలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓలతోపాటు ఆరుగురు వైద్యులు మహమ్మారికి చిక్కారు. ఇదే ఆస్పత్రిలో ఐదారుగురు నర్సులు, ఇతర సిబ్బందికి పాజిటివ్‌ అని తేలింది. వైద్య కళాశాలలోనూ కరోనా అలజడి రేపుతోంది. ప్రిన్సిపాల్‌తోపాటు నలుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే కళాశాలలో కరోనా టెస్టింగ్‌ చేసే ల్యాబ్‌లోనూ వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. ఇక్కడ దాదాపు 50 మంది వరకు రీసెర్చ్‌ వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో శాంపిళ్లు అధికంగా వస్తున్నాయి. రోజుకు ఆరువేల వరకు శాంపిళ్లు వస్తుండడంతో మూడు బృందాలుగా ఏర్పడి, పరీక్షలు చేస్తున్నారు. అందులో 12 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ల్యాబ్‌ అధికారులు చెబుతున్నారు. ఇలా బోధనాస్పత్రిలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కరోనా బారిన పడడం అందరినీ ఆందోళనకు లోనుచేస్తోంది. జిల్లా ఆస్పత్రికి రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. సోమవారం వందలాది మంది చికిత్సల కోసం తరలివచ్చారు. దీంతో వైద్యవర్గాలు ఆందోళన మధ్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రతి ఓపీ విభాగంలోనూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ కనిపించారు. రోగులను బయట ఉంచి ఒక్కొక్కరిని మాత్రమే వైద్యుల గదుల్లోకి పంపించి చికిత్సలు అందేలా చూశారు. దీంతో రోగులు గంటల కొద్దీ ఆయా విభాగాల వద్ద అవస్థలు పడుతూ ఉండడం కనిపించింది. మొత్తం మీద వైద్యులపై కరోనా పంజా విసరడంతో బోధనాస్పత్రిలో ఆందోళన కొనసాగుతోంది.


మాజీ మంత్రి రఘువీరాకు కరోనా

మడకశిర రూరల్‌, జనవరి 24: మాజీ మంత్రి ఎన.రఘువీరారెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలు పాజిటివ్‌ అని తేలిందనీ, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోం  క్వారంటైనలో ఉంటున్నానని ఆయన తెలిపారు. వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌ అయిన వారంతా జాగ్రత్తగా ఉండాలనీ, లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోన జాగ్రత్తలు పాటించాలన్నారు. రఘువీరారెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు.. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇబ్బడిముబ్బడిగా కేసులు..!

అనంతపురం విద్య, జనవరి 24: బడుల్లో ఇబ్బడిముబ్బడిగా కరోనా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లు ఇలా అందరినీ ఎటాక్‌ చేసి కలవర పెడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే స్కూళ్లు, కేజీబీవీల్లో వందకుపైగా కేసులు వచ్చినట్టు సమాచారం. కేజీబీవీల్లోనే ఏకంగా 44 మంది పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారవర్గాలు పేర్కొంటున్నారు. ఇతర ప్రభుత్వ, జడ్పీ హైస్కూళ్లలో సైతం భారీగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.


44 మంది కేజీబీవీల్లోనే...

నార్పల కేజీబీవీలో ఒక విద్యార్థిని, ధర్మవరం, రొళ్లలో ఇద్దరు చొప్పున, ఉరవకొండలో ముగ్గురు, 8 మంది బోధన, బోధనేతర సిబ్బందికి, బత్తలపల్లిలో ఐదుగురు విద్యార్థినులు, ఇద్దరు సిబ్బంది, ఓడీసీలో ఆరుగురు బాలికలు, కంబదూరులో సిబ్బంది ఒకరు, పరిగిలో ఏడుగురు విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌, యాడికిలో ఇద్దరు, ముదిగుబ్బలో నలుగురు విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


ఇతర స్కూళ్లలోనూ...

జిల్లావ్యాప్తంగా చాలా స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాప్తాడు హైస్కూల్‌లో ముగ్గురు టీచర్ల, తపోవనం స్కూల్‌లో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. ఇదే స్కూల్‌లో మరో నలుగురు టీచర్లు జ్వరాలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలా చాలా స్కూళ్లలో జ్వరాలు, దగ్గు, జలుబుతో అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో పరీక్షలు చేయకపోవడంతో ఇంకా కేసులు బయటపడటం లేదు. పరీక్షలు చేస్తే స్కూళ్లలో వందల్లో కేసులు బయటపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులే చెబుతున్నారు.

Updated Date - 2022-01-25T06:26:21+05:30 IST