రాజస్థాన్‌లో kappa variant కలకలం... 11 కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-07-14T11:37:43+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గినప్పటికీ...

రాజస్థాన్‌లో kappa variant కలకలం... 11 కేసులు నమోదు

జైపూర్: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గినప్పటికీ, కరోనా వైరస్‌కు సంబంధించిన వివిధ వేరియంట్లు(Variants) ఆందోళనను మూడింతలు చేస్తున్నాయి. డెల్టా, డెల్టా ప్లస్... ఆ తరువాత కప్పా వేరియంట్ మన ముందుకు వచ్చాయి. రాజస్థాన్‌లో కప్పావేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకూ 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.


రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ మాట్లాడుతూ రాజస్థాన్‌లో ఇప్పటివరకూ 11 కప్పా వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డెల్టా వేరియంట్‌తో పోల్చిచూస్తే కప్పావేరియంట్ తక్కువ ప్రమాదకారి.  అయినప్పటికీ ప్రజలంతా కరోనా విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా రాజస్థాన్‌లో జూలై 13 వరకూ మొత్తం 9.53 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 28 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి మొత్తం 9.43 లక్షల మంది కోలుకున్నారు. 

Updated Date - 2021-07-14T11:37:43+05:30 IST