జూన్ 1 నుంచి రాజ‌ధాని‌లో వీటికి మిన‌హాయింపులు?

ABN , First Publish Date - 2020-05-30T15:51:38+05:30 IST

లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగియ‌నుంది. అయితే కరోనా వైరస్ కేసులు నిరంత‌రం పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ 4.0 ముగిశాక ఢిల్లీలో మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వివిధ‌మాల్స్‌లో...

జూన్ 1 నుంచి రాజ‌ధాని‌లో వీటికి మిన‌హాయింపులు?

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగియ‌నుంది. అయితే కరోనా వైరస్ కేసులు నిరంత‌రం పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ 4.0 ముగిశాక ఢిల్లీలో మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  వివిధ‌మాల్స్‌లో ఉన్న దుకాణాలను స‌రి-బేసి తరహాలో తెరవడానికి అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు లాక్‌డౌన్ మిన‌హాయింపుల‌పై సుదీర్ఘ చర్చ చేసి, ప‌లు ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించార‌ని తెలుస్తోంది. మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను తెర‌వాల‌ని, అయితే పెద్ద ఆల‌యాల‌ను, మ‌సీదుల‌ను మూసి ఉంచాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ దుకాణాలు రాత్రి 7 గంటల వరకు తెరుస్తున్నారు. అయితే వీటిని రాత్రి 9 గంటల వరకు తెరిచివుంచేలా అనుమ‌తివ్వాల‌ని దుకాణదారులు కోరుతున్నారు. వేసవిలో ప్రజలు సాయంత్రం మాత్రమే మార్కెట్లకు వస్తార‌ని, అందుకే ఈ వెసులు బాటు క‌ల్పించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. థియేటర్లు, పాఠశాలలు, కళాశాలలు ఇప్ప‌ట్లో ప్రారంభం కావు. అలాగే భారీ సమావేశాలకు అనుమ‌తి ఉండ‌దు. హోటళ్ళు, రెస్టారెంట్లు మొదలైనవాటికి కూడా అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌చ్చు. ప్రస్తుతానికి జిమ్, స్పా, సెలూన్‌ల‌ విషయంలో ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో పాటు ఢిల్లీ ప్రభుత్వం మెట్రోను నడపడానికి అనుకూలంగా ఉంది. అయితే దీనికి కేంద్రం నుంచి ఇంకా ఆమోదం రాలేద‌ని తెలుస్తోంది. 

Updated Date - 2020-05-30T15:51:38+05:30 IST