‘కరోనా మాత’కో ఆలయం!

ABN , First Publish Date - 2021-06-13T09:18:50+05:30 IST

ఆరాద్య దైవాలకు, అభిమాన నటులకు గుడులు కట్టి పూజించడం మన దేశంలో సర్వసాధారణమే. కానీ, కబలించే మృత్యువుకీ గుడులు కట్టి పూజించే వింత సంస్కృతి కొత్తగా వచ్చిపడింది. ప్రపంచాన్ని

‘కరోనా మాత’కో ఆలయం!

కట్టిన నాలుగురోజులకే కూల్చివేత.. యూపీలో విచిత్రం!


ప్రతాప్‌గడ్‌ (యూపీ), జూన్‌ 12: ఆరాద్య దైవాలకు, అభిమాన నటులకు గుడులు కట్టి పూజించడం మన దేశంలో సర్వసాధారణమే. కానీ, కబలించే మృత్యువుకీ గుడులు కట్టి పూజించే వింత సంస్కృతి కొత్తగా వచ్చిపడింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతానికి ‘మాత’గా నామకరణం చేసి మరీ గుడులు కట్టేస్తున్నారు. ముందుగా తమిళనాడులో మొదలైన ఈ ‘వెర్రి’.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు పాకింది. అక్కడి శుకుల్‌పూర్‌ అనే గ్రామంలో కొత్తగా ‘కరోనా మాత’ ఆలయం వెలసింది. అందులోని పూజారి.. తమ గ్రామస్థులకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా కాపాడాలంటూ నిత్యం కరోనా మాతకు పూజలు చేస్తుంటాడు. కానీ, ఈ నెల 7న ప్రారంభమైన ఈ ఆలయాన్ని నాలుగు రోజుల్లోనే దుండగులు కూల్చేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-13T09:18:50+05:30 IST