రష్యా ఫార్మసీల్లో కరోనా ఔషధం

ABN , First Publish Date - 2020-09-19T13:27:26+05:30 IST

కరోనా వ్యాక్సిన్ల తయారీ రేసులో ముందంజలో ఉన్న రష్యా.. తాజాగా మరో ముందడుగు వేసింది. తమ దేశానికి చెందిన ‘ఆర్‌-ఫార్మ్‌’ కంపెనీ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కట్టడికి అభివృద్ధి

రష్యా ఫార్మసీల్లో కరోనా ఔషధం

మాస్కో, సెప్టెంబరు 18: కరోనా వ్యాక్సిన్ల తయారీ రేసులో ముందంజలో ఉన్న రష్యా.. తాజాగా మరో ముందడుగు వేసింది. తమ దేశానికి చెందిన ‘ఆర్‌-ఫార్మ్‌’ కంపెనీ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కట్టడికి అభివృద్ధిచేసిన యాంటీ వైరల్‌ ఔషధం ‘కరోనవిర్‌’ను తొలిసారిగా ఔషధ దుకాణాల్లో విక్రయించేందుకు అనుమతులు మంజూరుచేసింది.

దీంతో వచ్చే వారం నుంచి అక్కడి ఫార్మసీల్లో కరోనవిర్‌ అందుబాటులోకి రానుంది. తేలికపాటి నుంచి మోస్తరు ఇన్ఫెక్షన్లతో చికిత్సపొందుతున్న కరోనా రోగులకు కరోనవిర్‌ను అందించేందుకు జూలైలోనే అనుమతులు లభించాయి.


Updated Date - 2020-09-19T13:27:26+05:30 IST