కరోనా అపోహలు.. వాస్తవాలు!

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

కరోనా పట్ల నెలకొనే అపోహలను ఎప్పటికప్పుడు చెదరగొడితేనే ఆ వైరస్‌ నుంచి పూర్తి రక్షణ పొందే అసలైన

కరోనా అపోహలు.. వాస్తవాలు!

కరోనా పట్ల నెలకొనే అపోహలను ఎప్పటికప్పుడు చెదరగొడితేనే ఆ వైరస్‌ నుంచి పూర్తి రక్షణ పొందే అసలైన జాగ్రత్తలు పాటించగలం. కాబట్టి నిజాలను తెలుసుకుందాం!


అపోహ: వ్యాయామం చేసే సమయంలో కూడా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి!

వాస్తవం: వ్యాయామం చేసే సమయంలో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడం కోసం మాస్క్‌ ధరించకూడదు. పైగా వ్యాయామం చేస్తున్నప్పుడు వెలువడే చమట వల్ల మాస్క్‌ తడిచి, ఊపిరి తీసుకోవడం మరింత కష్టమవుతుంది. చమట కారణంగా ఇతరత్రా సూక్ష్మక్రిములు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసే సమయంలో సామాజిక దూరంలో భాగంగా, ఇతరుల నుంచి కనీసం ఒక మీటరు దూరం తప్పక పాటించాలి.  


అపోహ: బూట్లు, చెప్పుల ద్వారా కరోనా సోకుతుంది. 

వాస్తవం: బూట్లు, చెప్పుల ద్వారా కరోనా వైరస్‌ సోకే అవకాశాలు చాలా తక్కువ. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మరీ ముఖ్యంగా ఇంట్లో నేల మీద పారాడే పసిపిల్లలు ఉన్నప్పుడు, పాదరక్షలను వాకిలి బయటే వదలడం మంచిది. ఇలా చేస్తే పాదరక్షలకు అంటుకుని ఉండే దుమ్ము, ధూళి ద్వారా సూక్ష్మక్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. 


అపోహ: థర్మల్‌ స్కానర్లతో కరోనా సోకిన విషయాన్ని కనిపెట్టవచ్చు!

వాస్తవం: థర్మల్‌ స్కానర్లు కేవలం వ్యక్తుల్లో ఉన్న జ్వరాన్ని (సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే) మాత్రమే కనిపెట్టగలవు. కొవిడ్‌ సోకిన వ్యక్తులను ఇవి గుర్తించలేవు.


Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST