కొత్త కేసులు 381.. మరో నలుగురు మృత్యువాత

ABN , First Publish Date - 2020-12-01T09:26:07+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 381 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం

కొత్త కేసులు 381.. మరో నలుగురు మృత్యువాత

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 381 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 8,68,064కు చేరాయి. తాజాగా 934 మంది కొవిడ్‌ బారి నుంచి కొలుకున్నారు. ఇప్పటి వరకూ 8,53,232 మంది డిశ్చార్జి కాగా, మరో 7,840 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అనంతపురం, కృష్ణా, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 6,992కు పెరిగాయి. 


నేటినుంచి కొవిడ్‌పై 50 రోజుల ప్రచారం

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున, దీనిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 50రోజుల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. డిసెంబరు 1 నుంచి జనవరి 19 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కార్యక్రమాలు చేపట్టి, కొవిడ్‌పై అవగాహన కల్పించనుంది. 

Updated Date - 2020-12-01T09:26:07+05:30 IST