వెయ్యి దాటాయి..

ABN , First Publish Date - 2022-01-21T05:59:13+05:30 IST

జిల్లాలో ఒకే రోజున వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

వెయ్యి దాటాయి..

జిల్లాలో కొత్తగా 1,066 కొవిడ్‌ కేసులు

16.63 శాతంగా పాజిటివ్‌ రేటు


గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకే రోజున వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం 6,408మంది టెస్టింగ్‌ చేయించుకోగా 1,066 మందికి వైరస్‌ ఉన్న నిర్ధారణ జరిగింది. పాజిటివ్‌ శాతం 16.63గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో క్రియాశీలక కేసులు 4,455కి చేరాయి. ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో వెంటిలేటర్‌లపై 7, ఐసీయూలో 58, ఆక్సిజన్‌ పడకలపై 109, నాన్‌ ఐసీయూలో 149 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గురువారం గుంటూరు నగరంలో 568, తాడేపల్లిలో 70, నరసరావుపేటలో 65, మంగళగిరిలో 49, తెనాలిలో 31, సత్తెనపల్లిలో 29, పెదకాకానిలో 21, చిలకలూరిపేటలో 20, తాడికొండలో 15, అమరావతిలో 4, అచ్చంపేటలో 4, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్‌లో 7, క్రోసూరులో 3, మేడికొండూరులో 7, ముప్పాళ్లలో 4, పెదకూరపాడులో 3, పెదనందిపాడులో 1, ఫిరంగిపురంలో 1, ప్రత్తిపాడులో 5, రాజుపాలెంలో 3, తుళ్లూరులో 4, వట్టిచెరుకూరులో 3, దాచేపల్లిలో 5, దుర్గిలో 5, గురజాలలో 2, కారంపూడిలో 1, మాచవరంలో 8, మాచర్లలో 10, పిడుగురాళ్లలో 8, వెల్దుర్తిలో 2, బొల్లాపల్లిలో 1, యడ్లపాడులో 4, ఈపూరులో 3, నాదెండ్లలో 4, నూజెండ్లలో 2, నకరికల్లులో 8, రొంపిచర్లలో 4, శావల్యాపురంలో 4, వినుకొండలో 11, అమర్తలూరులో 3, భట్టిప్రోలులో 1, బాపట్లలో 10, చేబ్రోలులో 6, చెరుకుపల్లిలో 6, కొల్లూరులో 1, దుగ్గిరాలలో 2, కాకుమానులో 1, కర్లపాలెంలో 3, కొల్లిపరలో 6, నగరంలో 4, నిజాంపట్నంలో 3, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 5, రేపల్లెలో 6, చుండూరులో 6, వేమూరులో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి కిట్స్‌ కూడా పంపిణీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం 4,139 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా వారిలో 1,508 మందికి మాత్రమే కిట్స్‌ పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-21T05:59:13+05:30 IST