ఓ పక్క కరోనా, మరో పక్క జ్వరాలు

ABN , First Publish Date - 2021-05-16T06:27:00+05:30 IST

చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లెలో ఓపక్క కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఓ పక్క కరోనా, మరో పక్క జ్వరాలు
ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఆందోళనలో అరిగిలవారిపల్లెవాసులు


చంద్రగిరి, మే 15: చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లెలో ఓపక్క కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క జ్వరాల బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అరిగిలవారిపల్లెలో ఇప్పటివరకు సుమారు 30కిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా గ్రామంలో 30 మందికిపైగా జ్వరాలు బారిన పడ్డారు. పాజిటివ్‌ వచ్చిన వారిని సంబంధిత శాఖాధికారులు సరైన సమయంలో క్వారంటైన్‌కు తరలించి, గ్రామంలో శానిటైజేషన్‌ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై శనివారం ఎంపీడీవో రాధమ్మకు ఫిర్యాదు చేశారు. దాంతో పంచాయతీ అధికారులు స్పందించి.. గ్రామంలో చెత్తాచెదారాన్ని తొలగించి, వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేసి, శానిటైజేషన్‌ చేశారు. అలాగే ఇంటింటికీ వెళ్లి, జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇకనైనా వైరస్‌ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోకుంటే మరింత విస్తరించే ప్రమాదం ఉందని పరిసర గ్రామాల వారూ ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-05-16T06:27:00+05:30 IST