మాస్ ఏరియాల్లో కరోనా మహమ్మారి తీవ్రరూపం

ABN , First Publish Date - 2020-07-08T20:15:19+05:30 IST

జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, పరిశుభ్రత తక్కువగా ఉండటం...

మాస్ ఏరియాల్లో కరోనా మహమ్మారి తీవ్రరూపం

అమరావతి: జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, పరిశుభ్రత తక్కువగా ఉండటం, ఇరుకు ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు నిలయాలుగా మారినట్లు ఓ అధ్యయనంలో తేలింది. కోస్తా, ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే కేసులు నమోదవుతున్నాయని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి.


విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట, కార్మికనగర్, భవాణిపురం, మధురానగర్, రాజరాజేశ్వరిపేట, పశ్చిమ నియోజకవర్గం వంటి తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జనం ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో, నివసిస్తున్నారో అటువంటి ఏరియాల్లో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా నమోదు అవుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి కరోనాపై అవగాహన ఉండడంలేదని, వైరస్ వ్యాప్తికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2020-07-08T20:15:19+05:30 IST