ఇదే కరోనాకు కారణమా?

ABN , First Publish Date - 2020-03-28T05:57:28+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది పుట్టింది చైనాలోనే అని తెలిసిందే. ‘అలుగు’ అనే ప్రాణులను ఆహారంగా తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ పుట్టిందని...

ఇదే కరోనాకు కారణమా?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది పుట్టింది చైనాలోనే అని తెలిసిందే. ‘అలుగు’ అనే ప్రాణులను ఆహారంగా తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ పుట్టిందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. 


దీన్ని ఇంగ్లీషులో పాంగోలిన్స్‌ అంటారు. ఇవి క్షీరదాలు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కనిపిస్తాయి. 


‘అలుగు’ శరీరం దృఢమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. ఇది చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకుంటుంది.


ప్రమాదం ఎదురైనప్పుడు శరీరాన్ని గుండ్రంగా బంతిలా చుట్టుకొని రక్షించుకుంటుంది. ఈ ప్రాణికి ప్రధాన శత్రువులు అడవి పిల్లులు, హైనాలు, మనుషులు. 


ప్రపంచంలో ఎక్కువ అక్రమరవాణా అవుతున్న క్షీరదాల్లో ‘అలుగు’ ఒకటి. 


చైనా, వియత్నాం దేశాల్లోని ప్రజలు ఈ ప్రాణిని ఆహారంగా తీసుకుంటారు. ఆ దేశాల్లో ‘అలుగు’ మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంది.


‘అలుగు’ పొలుసులను చైనా సంప్రదాయ వైద్యంలో ఔషధంగా వాడుతుంటారు. ఆస్తమా, రుమాటిజం, ఆర్థరైటిస్‌ సమస్యలను అది తగ్గిస్తుందని నమ్ముతారు. 


‘అలుగు’ను ఆహారంగా తీసుకోవడం వల్లనే కరోనా మహమ్మారి పుట్టిందని ఓ వాదన.

 

ఇప్పటికీ ఆఫ్రికాలోని నైజీరియాలో ‘అలుగు’ విక్రయాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

Updated Date - 2020-03-28T05:57:28+05:30 IST