రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ర్యాపిడ్‌ రెస్పాండ్‌ టీమ్‌

ABN , First Publish Date - 2020-04-04T09:41:21+05:30 IST

తిరుపతిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో 32, 35, 36, 37, 38 డివిజన్ల పరిధిలోని పదివేల కుటుంబాలను రెడ్‌జోన్‌ కింద ప్రకటించిన విషయం తెలిసిందే.

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో   ర్యాపిడ్‌ రెస్పాండ్‌ టీమ్‌

తిరుపతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో 32, 35, 36, 37, 38 డివిజన్ల పరిధిలోని పదివేల కుటుంబాలను రెడ్‌జోన్‌ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కార్పొరేషన్‌, పోలీసు అధికారులు ఈ ఐదు డివిజన్లలో కావాల్సిన సదుపాయాలతోపాటు ర్యాపిడ్‌ రెస్పాండ్‌ టీమ్‌ను ఏర్పాటుచేశారు.


దీంతోపాటు రెగ్యులర్‌ శానిటేషన్‌, పారిశుధ్య కార్మికులు, అధికారులు ప్రతి ఇంటి వద్దా సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌ స్ర్పే చేసి, బ్లీచింగ్‌ చల్లి.. కాలువలు శుభ్రం చేశారు. పదివేల కుటుంబాలకు సంబంధించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలప్యాకెట్లు, మెడిసిన్‌ కిట్లు తదితర వాటిని నగరపాలక సంస్థ సిబ్బంది, వార్డు వలంటీర్లు అందించారు. టి.నగర్‌ వాసులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యుల మెడికల్‌ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.


‘కోవిడ్‌’ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కోవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 0877-2256766, 103 నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చని కమిషనర్‌ గిరీష తెలిపారు. 

Updated Date - 2020-04-04T09:41:21+05:30 IST