భర్త మృతి.. భార్యకు టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్.. ఓ గ్రామంలో హైటెన్షన్..!

ABN , First Publish Date - 2020-05-22T18:46:26+05:30 IST

మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి కరోనా పాజిటివ్‌ రావడంతో తొ ర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో రెండు రోజులుగా ఇంటింటికి వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటచలం వెల్లడించారు. కంఠాయపాలెం గ్రామానికి ఇటీవల మహారాష్ట్ర నుంచి దంపతులు రాగా, భర్త అనారోగ్యంతో మృతి చెందగా

భర్త మృతి.. భార్యకు టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్.. ఓ గ్రామంలో హైటెన్షన్..!

కంఠాయపాలెంలో హైటెన్షన్‌

కరోనా పాజిటివ్‌ తేలడంతో రాకపోకలు బంద్‌

రెండు రోజులుగా ఇంటింటికి వైద్యపరీక్షలు

20 మంది ఐసోలేషన్‌కు తరలింపు


తొర్రూరు(మహబూబాబాద్): మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి కరోనా పాజిటివ్‌ రావడంతో తొ ర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో రెండు రోజులుగా ఇంటింటికి వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటచలం వెల్లడించారు. కంఠాయపాలెం గ్రామానికి ఇటీవల మహారాష్ట్ర నుంచి దంపతులు రాగా, భర్త అనారోగ్యంతో మృతి చెందగా, భార్యకు పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారితో ప్రయాణం చేసిన, కలిసిన అందరికీ 13 వైద్య బృందాలతో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన మహిళతో 12 మంది ప్రయాణించగా, మడిపల్లి, తొర్రూరు, అమ్మాపురం గ్రామాలకు చెందిన మరో ఎనిమిది మంది బంధువులు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం 20మందిని మహబూబాబాద్‌కు తరలించామన్నారు. పాజిటివ్‌ వచ్చిన మహిళను కలిసిన వారి కుటుంబాలు హోం క్వారంటైన్‌ ఉండేవిధంగా పోలీసు సిబ్బంది నియమించిన్నట్లు సీఐ చేరాలు వెల్లడించారు. గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవ్వరు రాకుండా అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, కట్టుదిటమైన చర్యలు చేపట్టారు. గ్రామ సరిహద్దులో ముళ్ల కంచెలు వేసి రాకపోకలు పూర్తిగా మూసివేశారు. మండలంలో మొదటి కరోనా పాజిటివ్‌ కావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 


వ్యాపారాలు బంద్‌

తొర్రూరు మండలంలో కరోనా కేసు నిర్ధారణ కావడంతో తమ వ్యాపారాలను ఈనెల 25వ తేదీ వరకు స్వచ్ఛందంగా బంద్‌ చేపడుతున్నామని  వ్యా పారులు ప్రకటించారు. రెడీమేడ్‌ వస్త్ర వ్యాపారులు, ఇతర వ్యాపార సంస్థలు 25వ తేదీ వరకు, సెలూన్లు ఈనెల 31 వరకు బంద్‌ చేస్తామని ఆయా సంఘాల నాయకులు కూరపాటి సోమయ్య, ఎనగందుల శ్రీనివాస్‌ తెలిపారు. షాపులు తెరిచి వ్యాపారాలు చేస్తే రూ.20వేలు జరిమానా విధిస్తామని వారు తెలిపారు.


నలుగురు హోం క్వారంటైన్‌

తొర్రూరు మండలంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళను పరామర్శించేందుకు వెళ్లి వచ్చిన కేసముద్రం విలేజికి చెందిన ఆమె బంధువులను హోం క్వారంటెన్‌లో ఉంచినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో పనిచేస్తున్న తొ ర్రూరుకు ప్రాంతానికి చెందిన వ్యక్తి లాక్‌డౌన్‌తో తిరిగి స్వగ్రామానికి వచ్చి ఈనెల 17న అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు సదరు వ్యక్తి అంత్యక్రియలకు వారి బంధువులైన కేసముద్రం విలేజికి చెందిన నలుగురు, ఓ ఆటో డ్రైవర్‌ హాజరయ్యారు. వీరిలో ఒక మ హిళ వారి ఇంటివద్దనే ఉండగా ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. మిగతా ముగ్గురు ఆటో డ్రైవర్‌తో పాటు తిరిగి కేసముద్రం విలేజికి వచ్చారు. దీంతో వీరికి ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు తహసీల్దార్‌ తెలిపారు. వీరి వెంట ఎస్సై సతీష్‌, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


ఆస్పత్రిలో క్యాంటీన్‌ మూసివేత

మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని క్యాంటీన్‌తో పాటు సమీపంలోని ఓ ప్రైవేట్‌ మందుల దుకాణాన్ని గురువారం మూసివేశారు. తొర్రూరుకు చెందిన కరోనా పాజిటివ్‌ మహిళ కుమారుడు జిల్లా ఆస్పత్రిలోని క్యాంటీన్‌లో టిఫిన్‌ చేయడంతో పాటు సమీపంలోని ఓ మందుల దుకాణంలో మందుల కోసం వెళ్లాడని ఆరా తీసిన అధికారులు.. ఆ రెండు షాపులను మూసివేసి వారి రక్తనమూనాలను కూడా సేకరించారు.

Updated Date - 2020-05-22T18:46:26+05:30 IST