తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులెన్నంటే..

ABN , First Publish Date - 2020-03-26T14:37:01+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులెన్నంటే..

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతోంది. రోజుకు నాలుగైదు చొప్పున పాజిటివ్ కేసులు తేలుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.


కాగా.. దేశాన్ని కమ్మేసిన కరోనా వైరస్‌ను అరికట్టేందుకు 21 రోజుల లాక్‌ డౌన్‌ సరిపోదని.. ఏప్రిల్‌ 15 తర్వాత మరిన్ని రోజులు లాక్‌డౌన్‌‌ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


కేంద్రం ఆదేశాలతో..

ఏపీలో ఇప్పటికే లేబొరేటరీలను విస్తరిస్తున్న ఈ శాఖ.. ఇప్పుడు ప్రత్యేక కరోనా ఆస్పత్రుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను గానీ, పాజిటివ్‌ వచ్చినవారిని గానీ సాధారణ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స చేయరాదని కేంద్రం ఆదేశించిన దరిమిలా.. ప్రత్యేకంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 13 జిల్లాలకు అనుకూలంగా ఉండే బోధనాస్పత్రులను గుర్తించింది. విశాఖపట్నంలోని విమ్స్‌, తిరుపతి రుయా, విజయవాడ, నెల్లూరు ప్రభుత్వాస్పత్రులను కరోనాసెంటర్లుగా మార్చారు.

Updated Date - 2020-03-26T14:37:01+05:30 IST