జిల్లాలో 130 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-09T06:13:43+05:30 IST

జిల్లాలో గురువారం 130 మందికి కరోనా సో కినట్లు నిర్ధారణ అయింది.

జిల్లాలో 130 మందికి కరోనా పాజిటివ్‌
దేశరాజుపల్లిలో పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 8: జిల్లాలో గురువారం 130 మందికి కరోనా సో కినట్లు నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రాగా మానకొండూర్‌ మండలంలో ఇద్దరు, తిమ్మాపూర్‌లో ఆరుగురు, రామ డుగులో 18 మంది, హుజురాబాద్‌లో 11 మంది, చిగురుమామిడిలో ఇద్దరు, చొప్పదండిలో 10 మంది, సైదాపూర్‌లో ఇద్దరు, జమ్మికుంటలో నలుగురు, కొత్తపల్లిలో 17 మంది వ్యాధిబారిన పడ్డారు. 

2,239 మందికి వ్యాక్సిన్‌..

జిల్లా వ్యాప్తంగా గురువారం 25 ప్రభుత్వ, ఆరు ప్రైవేట్‌ ఆసుపత్రులలో 45 సంవత్సరాల పైబడినవారితోపాటు 60 సంవత్సరాలు పూరైనవారు, 45 సంవ త్సరాలు పైబడి కోమార్బిడి(బీపీ, షుగర్‌తోపాటు ఇతర ధీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు) వారికి 28 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 2,329 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. కొవిన్‌ 2.0 యాప్‌ ద్వారా 2,329 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా 2,329 మంది టీకా తీసుకున్నారని, 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన వారందరూ తప్పనిసరిగా తమకు దగ్గరలో ఉన్న ప్రభు త్వ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైందని, ఎలాంటి అనుమానాలు పెంచుకోవద్దన్నారు. వ్యాక్సి న్‌ వేసుకున్న వారు కూడా సాధారణ ప్రజలవలె మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. తద్వారా కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు  బాధ్యతా రాహి త్యంగా ఉండకూడదని, జాగ్రత్తలు వహించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని, దగ్గు, జలుబు, జ్వరం, తల నొప్పి, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేం ద్రంలో  కొవిడ్‌ పరీక్షలు చేయిం చుకోవాలని సూచించారు. 

 గోపాల్‌రావుపేటలో 10 పాజిటివ్‌ కేసులు

రామడుగు : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలం లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో 313 మందికి పరీక్ష లు నిర్వహించగా 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా గోపాల్‌రావుపేటలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేప థ్యంలో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. బుధవారం 10 మందికి పాజి టివ్‌ రాగా ఒకే ఇంట్లో మూడు కేసులు నమోదయ్యాయి.   

 


Updated Date - 2021-04-09T06:13:43+05:30 IST