ఉమ్మడి జిల్లాలో 630 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-27T06:18:48+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 630 మందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 379, యాదాద్రిలో 199, సూర్యాపేట జిల్లాలో 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాగార్జునసాగర్‌ లో కరోనా కలకలం సృష్టిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 630 మందికి కరోనా పాజిటివ్‌

సాగర్‌ కమలా నెహ్రూ ఆసుపత్రి సిబ్బందిలో 14 మందికి..



దేవరకొండ, నాగార్జునసాగ ర్‌, కేతేపల్లి, అడవిదేవులపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 630 మందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 379, యాదాద్రిలో 199, సూర్యాపేట జిల్లాలో 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాగార్జునసాగర్‌ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత రెండు రోజులుగా జిల్లాలోనే అత్యధికంగా సాగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యి. ఇందులో స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది అఽఽధికంగా ఉన్నారు. మంగళవా రం 150మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 61 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా అందులో ఆసుపత్రి సిబ్బంది ఏడుగురు ఉన్నారు. బుధవారం 197 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అందులో హిల్‌కాలనీకి చెందిన 39 మంది కి, ఫైలాన్‌ కాలనీకి చెందిన 15 మందికి, ఆసుపత్రి సిబ్బందికి 14 మందికి, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కేతేపల్లి మండలంలో కరోనా పరీక్షలు 64 చేయగా, 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేవరకొండ డివిజన్‌లో బుధవారం 683 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. దేవరకొండలో 23 మందికి, డిండిలో 10 మందికి, గుడిపల్లిలో ఒకరికి, గుర్రంపోడులో ఒకరికి, కొండమల్లేపల్లిలో 20 మందికి, బొడ్డుపల్లిలో నలుగురికి, మర్రిగూడ మండలంలో 10 మందికి, నాంపల్లిలో ఒకరికి, పీఏపల్లిలో ఆరుగురికి, వీటీనగర్‌లో ము గ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిం ది. అడవిదేవులపల్లిలో 92మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ ఉపేందర్‌ తెలిపారు. కరోనా ప్రభావంతో నిడమనూరు ఆంధ్రాబ్యాంకు ఎదుట జాతీయ జెండా ఎగురలేదు. ఆంధ్రా బ్యాంకు(యూనియన్‌ బ్యాంకు) మేనేజర్‌తోపాటు అందులో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


కొనసాగుతున్న జ్వర సర్వే

ఉమ్మడి జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతోంది. ఆరో రోజు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70,656 ఇళ్లను సర్వే చేయగా, 2234 మందికి జ్వర లక్షణాలను గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 37,782 ఇళ్లను సర్వే చేయగా, 1519 మందికి, యాదాద్రి జిల్లాలో 10,009 ఇళ్లను సర్వేచేయగా, 458 మందికి, సూర్యాపేట జిల్లాలో 22,865 ఇళ్లను సర్వే చేయగా 257మందికి జ్వర లక్షణాలను వైద్య సిబ్బంది గుర్తించారు. వీరికి మెడికల్‌ కిట్‌ అందజేసిన వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 


జ్వర సర్వే ఇలా...

జిల్లా తేదీ సర్వే చేసిన జ్వర లక్షణాలు

కుటుంబాలు ఉన్నవారు

నల్లగొండ 21న 58,400 2,040

22న 72,111 2,478

23న 68,237 2,228

24న 68,262 2,638

25న 56,647 2,480

26న 37,782 1,519

యాదాద్రి 21న 43,758 2,551

22న 62,178 3,230

23న 56,638 2,687

24న 59,636 3,096

25న 56,923 2,408

26న 10,009     458

సూర్యాపేట 21న 86,267 512

22న 32,499 390

23న 32,524 181

24న 36,652 227

25న 32,208 278

26న 22,865 257

మొత్తం 8,93,596 29,658

Updated Date - 2022-01-27T06:18:48+05:30 IST