కరోనా కలకలం.. 70 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-23T17:47:19+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఇప్పటి వరకు భూపాలపల్లి పట్టణంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు పల్లెల్లోకి వైరస్‌ ప్రవేశించింది. ఈ నెల 14న ముం బయి నుంచి వచ్చిన వృద్ధుడికి(75

కరోనా కలకలం.. 70 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌

ముంబయి నుంచి నవాబుపేటకు వచ్చిన దంపతులు


భూపాలపల్లి కలెక్టరేట్‌/చిట్యాల: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. ఇప్పటి వరకు భూపాలపల్లి పట్టణంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు పల్లెల్లోకి వైరస్‌ ప్రవేశించింది. ఈ నెల 14న ముం బయి నుంచి వచ్చిన వృద్ధుడికి(75) 21న కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న కుమారుడి వద్ద 45 రోజు ల పాటు ఉన్నారు. ఈ నెల 14న ఆ దంపతులు నవాబుపేటకు వచ్చారు. అప్పటి నుంచే వృద్ధులను హోంక్వారంటైన్‌లో అధికారులు ఉంచారు.


ముంబయిలో ఉంటున్న కుమారుడికి కరోనా పా జిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం రాత్రి వృద్ధ దంపతుల షాంపిల్స్‌ సేకరించి పరీక్షలు చేశారు. వృద్ధునికి కరోనా పాజిటివ్‌ రాగా, వృద్ధురాలికి(60) నెగెటివ్‌ రిపోర్టు రావడంతో అతన్ని గాంధీకి తరలించారు. మళ్లీ పరీక్షలు చేయిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు తెలిపారు. అతనితో ప్రయాణంలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బాధిత వ్యక్తి గురువారం గ్రామంలోని చేతిపంపు వద్దకు నీటి కోసం వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో చేతిపంపు చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేశారు.


గత ఏప్రిల్‌ 3న మర్కజ్‌కు వెళ్లి వచ్చిన సింగరేణి కార్మికునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తరువాత అదే నెలలో 8వ తేదీన సింగరేణి కార్మికుని కూతురికి, 13న అతని భార్యకు కరోనా సొకిన విషయం తెలిసిందే. సింగరేణి కార్మికుడి భార్య, కూ తురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ కా గా, సదరు కార్మికుడు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నాడు. మూడో కేసు నమోదైన 39 రోజులకు మరో కేసు నమోదు కావడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం ఆరేంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లా కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో రెడ్‌ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-23T17:47:19+05:30 IST