89 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-14T10:28:27+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆర్యోగశాఖ గురువారం ప్రకటించిన బులిటెన్‌ ప్రకారంగా జిల్లాలో 89 మందికి

89 మందికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో ఇద్దరు మృతి 


కరీంనగర్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతిప్రతినిధి): కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆర్యోగశాఖ గురువారం ప్రకటించిన బులిటెన్‌ ప్రకారంగా జిల్లాలో 89 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గురువారం ఇద్దరు కరోనా బాధితులు జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరీంనగర్‌ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన 70 సంవత్సరాల ఓ వృద్ధుడు, శర్మనగర్‌కు చెందిన 75 సంవత్సరాల వృద్ధురాలు నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.


స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గురువారం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మందికి రాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా వారందరికీ నెగెటివ్‌ వచ్చింది. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి వ్యాధి నిర్ధారణ అయింది. హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో 59 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా అందులో 15 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. వీణవంకలో ఐదుగురు అనుమా నితులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇల్లందకుంట మండల కేంద్రంలో 20 మందికి పరీక్షలు చేయగా ఆరుగురు వ్యాధిబారిన పడ్డట్లు నిర్ధారించారు.


గంగాధర, శంకరపట్నం మండలాల్లో కోవిడ్‌ లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. గన్నేరువరం మండల కేంద్రంలోని ఒకే ఇంట్లో నలుగురికి, పారువెళ్లలో మరొకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, కొత్తపల్లి మండలంలో నలుగురు కరోనా వ్యాధిబారిన పడ్డట్లు తెలిసింది.  కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, కొత్తపల్లి మండలంలో నలుగురు కరోనా వ్యాధిబారిన పడ్డట్లు తెలిసింది. కరీంనగర్‌ పట్టణంలోని సరస్వతీనగర్‌లో ఒకరికి, చంద్రపురికాలనీలో ఒకరికి, సీతా రాంపూర్‌లో ఇద్దరికి, రేకుర్తిలో ఇద్దరికి, కట్టరాంపూర్‌లో ఒకరికి, భగత్‌నగర్‌లో ముగ్గురికి, చైతన్యపురి మహాశక్తి దేవాలయం ముందు ఇద్దరికి, కిసాన్‌నగర్‌లో నలుగురికి, వావిలాలపల్లిలో ఇద్దరికి, సుభా్‌ష్‌నగర్‌లో ఒకరికి, శర్మనగర్‌లో ఒకరికి, కాపువాడలో ఇద్దరికి, హౌసింగ్‌బోర్డుకాలనీలో నలుగురికి, లక్ష్మీనగర్‌లో ఇద్దరికి, పద్మశాలి వీధిలో ఒకరికి కరోనా సోకినట్లు తెలిసింది. 

Updated Date - 2020-08-14T10:28:27+05:30 IST