జిల్లాకు ముంబాయి టెన్షన్‌..

ABN , First Publish Date - 2020-05-15T10:35:24+05:30 IST

జిల్లాకు ముంబాయి టె న్షన్‌ పట్టుకుంది. రోజుకు వందల సంఖ్యలో ముం బాయి నుంచి వలస కార్మికులు జిల్లాకు చేరుకుంటుండగా, అందులో

జిల్లాకు ముంబాయి టెన్షన్‌..

ముంబాయి నుంచి వచ్చిన మరో వలస కూలీకి కరోనా పాజిటివ్‌

ఆయనతో పాటు వచ్చిన నలుగురు ఐసోలేషన్‌కు తరలింపు

తాటిపెల్లిలో వలస కార్మికులను ఇంట్లో వేసి తాళాలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాకు ముంబాయి టె న్షన్‌ పట్టుకుంది. రోజుకు వందల సంఖ్యలో ముం బాయి నుంచి వలస కార్మికులు జిల్లాకు చేరుకుంటుండగా, అందులో కరోనా పాజిటివ్‌ వ్యక్తులు బ యట పడుతుండటంతో జిల్లావాసులు కలవరపాటు కు గురవుతున్నారు. ముంబాయి నుంచి వచ్చిన మ రో వలస కూలీకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వె ల్గటూర్‌ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు గురువారం జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. ఈయన రెండు రోజుల క్రి తం పెద్దపల్లి జిల్లా నందిమేడారానికి చెందిన ఇద్ద రు, వెల్గటూర్‌ మండల కేంద్రానికి చెందిన ఒకరు, అదే మండలం పైడిపెల్లికి చెందిన మరొకరితో ట్యా క్సీలో జగిత్యాలకు వచ్చాడు. వైద్యులు వీరు ఐదుగురికి పరీక్షలు చేయగా రాజక్కపల్లెకు చెందిన వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండటంతో ఆ యనను జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంచారు.


మిగిలిన నలుగురికి స్టాంపులు వేసి హోం క్వారంటైన్‌లో ఉండా లంటూ పంపించారు. అయితే రాజక్కపల్లెకు చెంది న వ్యక్తికి పరీక్షలు చేయగా, గురువారం కరోనా పా జిటివ్‌ అని తేలడంతో జిల్లాలో ఒక్కసారిగా టెన్షన్‌ పెరిగినట్లయింది. దీంతో ఉన్నఫలంగా ఆయన వెం ట వచ్చిన నలుగురికి ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. రాజక్కపల్లెకు చెందిన వ్యక్తిని చి కిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. జిల్లా లో ఇప్పటివరకు నలుగురికి పాజిటివ్‌ కేసులు రాగా, ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు. మల్యాల మండలం త క్కళ్లపెల్లివాసి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నా డు. అయితే మరో ముగ్గురు వలస కార్మికులకే పాజిటివ్‌ రాగా, ఈ ముగ్గురినీ హైదరాబాద్‌కు తరలించ గా అక్కడే చికిత్స పొందుతున్నారు.


ఆందోళనలో జిల్లా ప్రజలు

జగిత్యాల జిల్లా ప్రజలు ముంబాయి వలస కార్మికులతో ఆందోళన చెందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గురువారం రాత్రి వరకు 2784 మంది జి ల్లాకు వచ్చినట్లు చెబుతున్నా.. మరో వెయ్యి మందికి పైగా జిల్లాకు అనధికారికంగా చేరుకున్నట్లు ప్రచా రం సాగుతోంది. గ్రామాల్లో ముంబాయి నుంచి వచ్చినవారిని ఇళ్లల్లో ఉండవద్దంటూ కొన్ని చోట్ల ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 10 మందిని, మల్లాపూర్‌ మండలం వెంకట్రావుపేటలో 15 మందిని, వెల్గటూర్‌ మండ లం గుల్లకోట, పాతగూడూరులో 23 మందిని, గొల్లపల్లి మండలం చెందోళిలో 8 మందిని ప్రజలు అ భ్యంతరం తెలుపడంతో ప్రభుత్వ పాఠశాలలోనే ఉం చారు. మల్యాల మండలం తాటిపెల్లిలో 11 మంది ని గ్రామ పంచాయతీ భవనంలో ఉంచి భోజన స దుపాయం కల్పిస్తున్నారు.


కాగా అదే గ్రామానికి చెందిన 14 మంది ఒకే కుటుంబానికి చెందినవారు ముంబాయి నుంచి రాగా వారిని ఒకే గదిలో ఉంచి పంచాయతీ అధికారులు తాళం వేశారు. వారికి గ్రా మ పంచాయతీ నుంచే నిత్యావసర సరుకులు అంది స్తున్నారు. అయితే దీనికి ఆ కుటుంబసభ్యులు కూ డా అంగీకరించారు. జిల్లాలోని బీర్‌పూర్‌ మండలం కండ్లపెల్లి, గొల్లపల్లి మండల కేంద్రం నల్లగుట్టకు చెందిన ఇద్దరు, వెల్గటూర్‌ మండలంలోని వెల్గటూర్‌, అంబారిపేటకు చెందిన ఇద్దరు, ధర్మపురి మండలంలోని కమలాపూర్‌కు చెందిన ఇద్దరు ముంబాయి నుంచి రాగా హోం క్వారంటైన్‌ నిబంధనలు పాటించకపోవడంతో వీరిని కొండగట్టులోని జేఎన్‌టీయూ లో ఏర్పాటు చేసిన హోంక్వారంటైన్‌కు తరలించారు. అయితే కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. బీర్‌పూర్‌లో ఏకంగా గొడవ పడినట్లు తెలిసింది.


Updated Date - 2020-05-15T10:35:24+05:30 IST