వైద్య బృందాలు పకడ్బందీగా పనిచేయాలి

ABN , First Publish Date - 2020-04-04T12:07:09+05:30 IST

రోనా నివారణలో భాగంగా ప్రాథమిక, సెకెం డరీ వైద్య బృందాలు పకడ్బందీగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

వైద్య బృందాలు  పకడ్బందీగా పనిచేయాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

 కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌


కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 : కరోనా నివారణలో భాగంగా ప్రాథమిక, సెకెం డరీ వైద్య బృందాలు పకడ్బందీగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఈమే రకు శుక్రవారం  కలెక్టర్లతో  ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాధార ణ రోగులు ఇబ్బందులు పడకుండా ప్రతీ ఇంటికి వైద్య బృందాలు సర్వే చేసి రోగుల వివరాలు తెలుసుకుని వైద్య సేవలు అందించాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం అధికంగా  ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సెకెండరీ వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో వార్డుకి ఒకటి, మునిసిపాలిటీ పరిధిలో 3 వార్డులకు ఒకటి చొ ప్పున సెకెండరీ స్థాయి బృందాలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి బృందాలు సక్రమంగా పనిచేసే విఽ దంగా చర్యలు తీసుకోవలన్నారు. గ్రామ వలంటీరు, ఆరోగ్య కార్యకర్త, ఏ ఎన్‌ఎం, ఆశా వర్కర్లతో కూడిన ఈ బృందాలను జిల్లా మండల స్థాయి అధి కారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వారి సేవలను గుర్తించాలన్నారు. హాట్‌ స్పాట్‌లను గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణలో అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నివాస్‌, జేసీ డా. కె.శ్రీనివాసులు, ఐటీడీఏ పీవో సాయికాంత్‌ వర్మ, ట్రైనీ కలెక్టర్‌ భార్గవ్‌తేజా, డీఆర్‌వో దయానిధి,  డీఎంహెచ్‌వో డా.చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T12:07:09+05:30 IST