కరోనా నివారణ లాక్‌డౌన్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2021-05-17T04:33:58+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ లాక్‌డౌన్‌తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

కరోనా నివారణ లాక్‌డౌన్‌తోనే సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఐకే రెడ్డి

- రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, మే 16: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ లాక్‌డౌన్‌తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ నివారణ ఇతరఅంశాలపై కలెక్టరేట్‌లో ఆది వారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వివిధ శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు ఎక్కువగాఉన్నారని వారికి రానున్నరోజుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడానికి అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి ఫీవర్‌ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

 కరోనా వ్యాధిగ్రస్తులకు అవసరాన్ని బట్టి రెమి డీసివర్‌ ఇంజక్షన్‌ అందంచాలన్నారు. జిల్లాకు ప్రతి రోజు 50ఇంజక్షన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇతర జల్లాల్లో జిల్లాకు చెందిన పేషంట్లు ఎవరైనా చికిత్స పొందితే కలెక్టర్‌ అనుమతితో ఇంజక్షన్‌ ఇవ్వవచ్చన్నారు. ప్రస్తుతం బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువ కలకలం రేపుతోందని అన్నారు. జిల్లాలో అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే హైదరాబా ద్‌లో మూడు ఆస్ప త్రులను ప్రభుత్వం కేటాయిం చింద న్నారు. అక్కడికి వారికి పంపిం చాలని వైద్యశాఖను ఆదేశిం చారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, దీనితో జిల్లాకు కావాల్సిన నిధులు అనుకున్న మొత్తంలో కేటాయిం చలేక పోతున్నామని అన్నారు. జిల్లాలో విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం అభివృద్ది చెందాలంటే విద్యుత్‌ నిరంతరం సరఫరా చేస్తేనే సాధ్యమవు తుందన్నారు. దీనికి విద్యుత్‌శాఖ అధికారులు స్పందిస్తూమూడు నెలల్లో సమస్య తీరుస్తామని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లా డుతూ జిల్లాలో ప్రైవేటు ఆస్ప త్రుల్లో 53, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 48ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు మొదటిడోస్‌ 41 వేలమందికి అందించామ న్నారు. ఇంటింటి సర్వే ద్వారా 9300మందికి కిట్లు అందజేసి నట్లు తెలిపారు. జిల్లాలో రోజు 45సిలిండర్లు అవసరం అవుతు న్నాయనిమంత్రికి వివరించారు. వైరస్‌ వ్యాధినివారణకు అన్నిచ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

అనంతరం ఎమ్మెల్యే ఆత్రంసక్కు మాట్లా డుతూ జిల్లాలో మెడికల్‌ సిబ్బంది ఎక్కువగా లేరని వారి నియా మకాల్లో కలెక్టర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్‌ పీరి యడ్‌లో పోలీసులు చేస్తున్న విధులు అభినందనీయమన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశా లలో విద్యావలంటర్లకు ఆదర్శ పాఠశాలల్లో ఔట్‌సో ర్సింగ్‌ ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చేలా ముఖ్య మంత్రితో మాట్లాడాలని మంత్రిని కోరారు. జిల్లా గిరిజనప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం పెంచేలా రోడ్లు మంజూరు చేయాలన్నారు. సిర్పూర్‌(యూ) మండలంలో కొన్ని గ్రామాలకు ఐదురోజుల నుంచి తాగునీరు రాక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. వీటిలో నాలుగు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు కాగా రెండు అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఉన్నాయ న్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ రాజేశం, డీఎ స్పీలు అచ్చేశ్వర్‌ రావు, స్వామి, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T04:33:58+05:30 IST