Abn logo
Apr 6 2020 @ 05:00AM

భౌతిక దూరంతోనే కరోనా నివారణ

పార్వతీపురం, ఏప్రిల్‌ 5 : భౌతిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్‌ను నివారించగలమని, దీనికి ప్రజలు సహకరించాలని సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలకు వ్యవసాయ మార్కెట్‌ యార్డు లోని కూరగాయ లు, చేపలు, మాంసాహార మార్కెట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటించేలా కొనుగోలు కేంద్రాల వద్ద వేసిన మార్కింగ్‌లను పరిశీలించారు.  పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మునిసిపల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మికి సూచనలు చేశారు.  

Advertisement
Advertisement
Advertisement