3 వేలు దాటిన కేసులు

ABN , First Publish Date - 2021-04-11T08:25:54+05:30 IST

రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు

3 వేలు దాటిన కేసులు

చిత్తూరులో అత్యధికంగా 740 

ఉండి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌..  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్‌ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9,21,906 కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందారు. చిత్తూరులో మగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో 7291 మంది మృత్యువాతపడ్డారు. 


ఉండి ఎమ్మెల్యేకు పాజిటివ్‌.. 

పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివా్‌స(నాని) ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శనివారం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  తన సొంత కారులో ఆసుపత్రికి వచ్చి రిజిస్ట్రేషన్‌ రూమ్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Updated Date - 2021-04-11T08:25:54+05:30 IST