గాలి ద్వారా 2 మీటర్ల దూరం కరోనా వ్యాప్తి!

ABN , First Publish Date - 2020-09-04T15:41:00+05:30 IST

ప్రపంచంపై కరోనా వైరస్‌ దాడి మొదలై 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీని వ్యాప్తికి సంబంధించిన కారణాలపై పరిశోధకులకు స్పష్టత రావడం లేదు. మొదట్లో గాలి ద్వారా

గాలి ద్వారా 2 మీటర్ల దూరం కరోనా వ్యాప్తి!

బీజింగ్‌, సెప్టెంబరు 3: ప్రపంచంపై కరోనా వైరస్‌ దాడి మొదలై 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీని వ్యాప్తికి సంబంధించిన కారణాలపై పరిశోధకులకు స్పష్టత రావడం లేదు. మొదట్లో గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం లేదన్న పరిశోధకులు ఆ తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్నారు. తాజాగా ఇప్పుడు గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా ఈ వైరస్‌ సోకే ప్రమాదముందని తేల్చారు.


జామా (జేఏఎంఏ) ఇంటన్నేషనల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా ఎలాంటి కాంటాక్ట్‌ లేనప్పటికీ గాలి ద్వారా వైరస్‌ రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదముంది. ఈ ఏడాది జనవరిలో చైనాలో ఓ లక్షణాలు కనిపించని కరోనా రోగి ద్వారా 24 మందికి ఇదే విధంగా కరోనా సోకింది. అతడు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో.. అతడికి రెండు మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా గాలి ద్వారా వైరస్‌ సోకింది. ఈ ఘటన వైరస్‌ తొలినాళ్లలో జరగడంతో.. అప్పటికి మాస్కు తప్పనిసరి నిబంధన అక్కడ లేదు. ఇలా.. నేటికీ కరోనాపై ఒక్కో అధ్యయనంలో ఒక్కో కొత్త విషయం బయటపడుతూనే వస్తోంది.


Updated Date - 2020-09-04T15:41:00+05:30 IST