రాజేంద్రనగర్‌లో పెరుగుతున్న కరోనా అనుమానితులు

ABN , First Publish Date - 2020-04-05T09:26:08+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని క్యారంటైన్‌ సెంటర్‌లకు కరోనా వైరస్‌ అనుమానితుల తాకిడి పెరిగింది.

రాజేంద్రనగర్‌లో పెరుగుతున్న కరోనా అనుమానితులు

రాజేంద్రనగర్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని క్యారంటైన్‌ సెంటర్‌లకు కరోనా వైరస్‌ అనుమానితుల తాకిడి పెరిగింది. ఇప్పటివరకు రాజేంద్రనగర్‌లోని మేనెజ్‌, ఎన్‌ఐపీహెచ్‌ఎం, టీఎ్‌సఐఆర్‌డీ, టీఎ్‌సక్యాబ్‌, ఐసీఎం, ఈటీసీ సెంటర్లలో సుమారుగా 289మంది ఉన్నారు. శనివారం షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు నుంచి 34మందిని తీసుకొచ్చారు. వారిని రాజేంద్రనగర్‌లోని ఈటీసీలో పెట్టారు.


చేగూరులో దుకాణం నిర్వహించుకునే ఓ వృద్ధురాలు అనారోగ్యానికి గురికాగా ఆమెను ప్రైవేటు అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ తరలించారని, తర్వాత ఆ వృద్ధురాలు మరణించింది. ఆమెకు కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో దుకాణానికి వచ్చిన ఓ బిహార్‌ వ్యక్తి ద్వారా కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. మరణించిన వృద్ధురాలు ఎవరెవరితో కలసిందనే వివరాలను సేకరించి ఆమెతో కలసిన 34మందిని రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్టు సమాచారం. 


మైలార్‌దేవుపల్లి నుంచి 10మంది

రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు మైలార్‌దేవుపల్లి వట్టెపల్లికి చెందిన 10మందిని శనివారం తీసుకొచ్చారు. శేరిలింగంపల్లి నుంచి 30మంది, సరూర్‌నగర్‌ నుంచి 18మందిని కూడా రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2020-04-05T09:26:08+05:30 IST