కరోనా కలకలం.. ఆసుపత్రికి క్యూ కట్టిన 120 మంది పోలీసులు.. స్టేషన్ ఖాళీ..!

ABN , First Publish Date - 2020-07-21T20:16:07+05:30 IST

కామారెడ్డి జిల్లాలో పోలీస్‌ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శాంపిల్‌ ఇచ్చేందు కు కోసం పోలీసులు క్యూ కట్టారు. సుమారు 120 మంది వరకు సిబ్బంది రాగా దాదాపు 40 మంది నుంచి మాత్రమే వైద్య సిబ్బంది శాంపిళ్లను సేకరించారు.

కరోనా కలకలం.. ఆసుపత్రికి క్యూ కట్టిన 120 మంది పోలీసులు.. స్టేషన్ ఖాళీ..!

పోలీస్‌ శాఖలో కరోనా కలకలం!

26 మంది సిబ్బందికి కరోనా

బాన్సువాడ, ఎల్లారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్‌, నస్రుల్లాబాద్‌లో పలువురు సిబ్బందికి పాజిటివ్‌

భయంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టిన పోలీసులు

120 మందిలోంచి 40 మందికి శాంపిళ్ల సేకరణ


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో పోలీస్‌ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శాంపిల్‌ ఇచ్చేందు కు కోసం పోలీసులు క్యూ కట్టారు. సుమారు 120 మంది వరకు సిబ్బంది రాగా దాదాపు 40 మంది నుంచి మాత్రమే వైద్య సిబ్బంది శాంపిళ్లను సేకరించారు. దీంతో మిగతా సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎ ల్లారెడ్డి, సదాశివనగర్‌, నస్రూల్లాబా ద్‌, తాడ్వాయిలో పలువురి సిబ్బందికి పాజిటివ్‌ లక్షణాలు వెలుగు చూడడంతో పాటు ఒకరోజే  26 మంది  పోలీసు సిబ్బందికి కరోనా లక్షణాలు బయట ప డడంతో పోలీస్‌ అధికారు లు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఎల్లారెడ్డి పోలీ స్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌కు కరోనా బయటపడడంతో పో లీస్‌ స్టేషన్‌లో పనిచేసే 17 మందికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. 


దీంతో పోలీస్‌ సిబ్బంది హోంక్వారంటైన్‌లో ఉండడం తో పోలీస్‌ స్టేషన్‌ ఖాళీ అయింది. సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆరుగురికి వైరస్‌ సోకింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది మొత్తం వైద్యపరీక్షల కోసం పరుగులు తీశారు. సదాశివనగర్‌ పీ హెచ్‌సీలో శాంపిళ్లు సేకరించకపోవడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. పోలీసు వాహనంలో ప్రయణించిన ఓ కానిస్టేబుల్‌కు కరో నా లక్షణాలు ఉండడం వల్ల ఆ వాహనంలో ప్రయాణించిన 30 మంది కానిస్టేబుళ్లు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కామారెడ్డికి చేరుకొని శాంపిళ్లు ఇచ్చారు. అలాగే నస్రుల్లాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురికి, తాడ్వాయి పోలీస్‌ స్టేష న్‌లో ఓ హోంగార్డుకు పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ కాంటా క్ట్‌ శాంపిళ్లను సేకరించగా సోమవారం మరో కానిస్టేబుల్‌కు కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి.


 దీంతో జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నా రు. ఇదిలా ఉండగా శాంపిళ్లు ఇచ్చేందుకు వచ్చిన పోలీసు లకు కరోనా లక్షణాలు ఉన్నవారితోపాటు పాజిటివ్‌గా నిర్ధా రణ అయిన వారి కుటుంబసభ్యులకు మాత్రమే ముందుగా శాంపిళ్లను సేకరిస్తున్నామని వైద్యులు తెలిపారు. దీంతో కొంతమంది అక్కడి నుంచి వెనుదిరిగారు. కానీ శాంపిల్‌ సేకరణ సమయంలో ప్రజలకు మాత్రం భౌతికదూరం పా టించాలంటూ చెప్పే పోలీసులే ఒకరిపై ఒకరు పడినట్లుగా నిలబడడంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులు పోలీసుల తీరును చూసి తమకు మాత్రమే నిబం ధనలు వివరిస్తారే తప్ప పోలీసులు మాత్రం పాటించరని వాపోయినట్లు సమాచారం.


ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో అప్రమత్తత...

కరోనా వైరస్‌ ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా లోని  పోలీస్‌ స్టేషన్లలో కరోనా నిబంధనలకు సంబంధించి అని ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. దీంతో లా క్‌డౌన్‌ సడలింపుల తర్వాత కూడా ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో శానిటైజర్ల ఏర్పాటు, భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్పని సరి చేయడంతో పాటు ప్రత్యేకంగా గేట్‌ ఎంట్రన్స్‌లో హోంగార్డు స్థాయి నుంచి కానిస్టేబుల్‌ను ఏర్పా టు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే వ్యక్తులను ఒకరిద్దిరినే అనుమతిస్తూ వారి వెళ్లిన తర్వాత మరికొందరికి అనుమతి స్తున్నారు. అయినా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా వైరస్‌ భారిన పడినట్లు తెలుస్తున్న మరికొందరు చిన్నపాటి విందుల్లో పాల్గొని కరోనా వైరస్‌ బారిన పడినట్లు సమాచారం.


ప్రజలకు తగ్గట్టుగా లేని ర్యాపిడ్‌ కిట్లు...

జిల్లాలో గతంలో ఏరియా ఆసుపత్రుల పరిధిలో శాంపి ల్‌ సేకరించి వాటిని హైదరాబాద్‌కు ల్యాబ్‌కు పంపేవారు. కానీ, ప్రస్తుతం జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో కూడా ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించడంతో శాంపిల్‌ సేకరణ చేపట్టి పరీక్ష లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్‌లో, లక్షణా లు ఉన్న వారికి పరీక్షలు చేసేందుకు కావలసిన సరిపడా కిట్లు, సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపైనే అధికభారం పడుతోందని, దీంతో ఏం చేయలేక కొందరి శాంపిళ్లను మా త్రమే సేకరించి హైదరాబాద్‌కు ల్యాబ్‌కు పంపుతున్నారు. మరి కొందరికి అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమ వారం సైతం ఆయా మండల కేంద్రాల్లో శాంపిల్‌ల సేకరణ చేపట్టకపోవడంతో దాదాపు 120 మంది వరకు పోలీస్‌ సిబ్బంది జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలి వచ్చారు.


పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక చర్యలు: శ్వేతారెడ్డి, కామారెడ్డి ఎస్పీ

జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉండడంతో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పోలీస్‌ స్టేషన్‌లో శా నిటైజర్‌ స్ర్పే చేస్తున్నారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్‌ కుటుంబాలు కూడా వైరస్‌ వల్ల ఇబ్బందులు పడకుండా ఇళ్లలో కూడా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. 

Updated Date - 2020-07-21T20:16:07+05:30 IST