హైదరాబాద్: మాజీ మంత్రి అఖిల ప్రియకు వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసుల హై డ్రామా వెలుగు చూసింది. మీడియా దృష్టి మరల్చి మరోసారి అఖిల ప్రియను బేగంపేట్‌లోని పటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన అఖిల ప్రియకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరోనా టెస్ట్ నిర్వహించకుండానే వైద్య పరీక్షల కోసం బోయిన్ పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అఖిల ప్రియ పోలీస్ వాహనం ముందూ వెనుకా ఎస్కర్ట్‌గా విమెన్ పోలీసులు ఉన్నారు.