ఖమ్మం జిల్లాలో సరిగా జరగని కరోనా టెస్టులు

ABN , First Publish Date - 2020-07-30T22:23:46+05:30 IST

ఖమ్మం జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి కొనసాగుతోంది.

ఖమ్మం జిల్లాలో సరిగా జరగని కరోనా టెస్టులు

ఖమ్మం జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి కొనసాగుతోంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎక్కడా టెస్టులు నిర్వహిండం లేదు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఖమ్మం నగరంతోపాటు జిల్లాలో అన్ని గ్రామాలకు కరోనా విస్తరించింది. ఇప్పటి వరకు 582 కేసులున్నట్లు అధికారికంగా ప్రభుత్వ వైద్యధికారులు నిర్ధారించారు. అత్యవసర చికిత్స అవసరం అయినవారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రోజుకు 2 వందల నుంచి 350 వరకు పరీక్షల కోసం వస్తున్నారు. అందులో రోజుకు 50 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు.

Updated Date - 2020-07-30T22:23:46+05:30 IST