అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-24T03:57:32+05:30 IST

ప్రతీ ఒక్కరికి కరోనా పరీ క్షలు నిర్వహించాకే నెగెటివ్‌ ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు సమీపంలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని ఆదివా రం పరిశీలించారు. కరోనా పరీక్షల వివరాలు, ప్రయా ణికుల సంఖ్య, రాకపోకలు తదితర అంశాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు.

అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

కోటపల్లి, జనవరి 23: ప్రతీ ఒక్కరికి కరోనా పరీ క్షలు నిర్వహించాకే నెగెటివ్‌ ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు సమీపంలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని ఆదివా రం పరిశీలించారు. కరోనా పరీక్షల వివరాలు, ప్రయా ణికుల సంఖ్య, రాకపోకలు తదితర అంశాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిష్టర్‌ లను పరిశీలించారు. కరోనా నిబంధనలు అమల య్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించేలా చైతన్యం కల్పించాలన్నారు.  తెలం గాణ వైపు వస్తున్న ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌గా తేలితే వెనక్కి  పంపిం చాలని ఆదేశించారు. అనంతరం పారుపెల్లిలో ఆరోగ్య సర్వే వివరాలను తెలుసుకున్నారు. పారుపెల్లిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన ప్రకృతి వనంలో నాటాల్సిన మొక్కలు, చేపట్టాల్సిన పనులపై అధికారు లకు సూచనలు చేశారు. పల్లె ప్రకృతి వనం ఆహ్లాద కరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవో భాస్కర్‌, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, ఏపీవో వెంకటేశ్వర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనాధ్‌, ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. 

ప్రతీ ఇంటా ఆరోగ్య సర్వే నిర్వహించాలి

నస్పూర్‌ :  ప్రతీ ఇంటా ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు ప్రశాంత్‌నగర్‌లో ఆదివారం ఆరోగ్య సిబ్బంది చేస్తున్న జ్వర సర్వే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చా రు. కచ్చితంగా ప్రతీ ఇంటా సర్వే చేయాలని, జ్వరాలు ఉన్నట్లయితే వైద్యుల సలహాల మేరకు మం దులు ఇవ్వాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నరా లేదా తెలు సుకోవాలన్నారు. మున్సిపాలిటీ కమిషనర్‌  రాజలింగు, సిబ్బంది శంకర్‌, చందు ఉన్నారు. 

భీమారం: మండలంలో ఆరోగ్య సర్వేను పకడ్బం దీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ముదిరాజ్‌ కాలనీలో ఆరోగ్య సర్వేను పరిశీలించారు. ప్రజలందరు సర్వేకు సహకరించాలని పేర్కొన్నారు. కొవిడ్‌ లక్షణా లున్న వారికి మెడికల్‌ కిట్‌లు పంపిణీ చేస్తామన్నారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించాలని సూ చించారు. ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైజ ర్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు.ఎంపీడీవో కార్యా లయంలోని రికార్డులను పరిశీలించారు.  గ్రామాల్లో రోజు పారిశుధ్య పనులను చేయించాలన్నారు. ఎంపీ డీవో శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది, కార్యదర్శులు ఉన్నారు. 


Updated Date - 2022-01-24T03:57:32+05:30 IST