లాక్‌ ఎట్‌ 60

ABN , First Publish Date - 2020-05-24T09:03:35+05:30 IST

కరోనా కట్టడి కోసం కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు శనివారంతో 60 రోజులు పూర్తయ్యాయి.

లాక్‌ ఎట్‌ 60

అదుపుకాని కరోనా.. కుదుటపడని జన జీవనం

లక్షలాది కుటుంబాల అవస్థలు 

ఊరటనివ్వని సడలింపులు

ఇళ్లకే అధికశాతం ప్రజలు పరిమితం


ఒంగోలు, మే 23 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడి కోసం కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు శనివారంతో 60 రోజులు పూర్తయ్యాయి. ఈ రెండు నెల లుగా అత్యధిక శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని వర్గాల జీవనం ఆస్తవ్యస్తమైంది. ఇంకా పూర్తిగా కరోనా అదుపులోకి రాక  ఆ భయం వెంటాడుతూనే ఉంది. అదే సమయంలో విభిన్న వర్గాల ప్రజలకు ఊరట కోసం ప్రభుత్వాలు ప్రకటించిన సడలింపులు కూడా జిల్లాలో అమలు కావడం లేదు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయన్నది అర్థంకాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 25నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో రెండు నెలలుగా పనులు లేక, ఉపాధి కోల్పోయి లక్ష లాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి తారుమారైంది. దాదాపు ఐదు లక్షల కుటుంబాల వరకూ ఉన్న అసంఘటిత కార్మికులు, మరో రెండు లక్షల వరకు ఉండే చిరు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి  పరిస్థితి అలాగే ఉంది. పండిన పంట ఉత్పత్తులు అమ్మకాలు సరిలేక, కీలక సమయంలో నగదు అందక, తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు అల్లాడుతున్నారు. ఆప్రభా వం వ్యవసాయ కూలీలపై తీవ్రంగా పడింది. వారికి అంతో ఇంతో ఊరటని స్తున్న ఉపాధి పనులు తాజాగా పెరిగినా ఎండలతో చేయలేకపోతున్నారు. పాడిపరిశ్రమ, చేనేత రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. వీటిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


మరోవైపు పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా పడకేశా యి. జిల్లాలో చెప్పుకోదగిన పారిశ్రామిక రంగం గ్రానైట్‌ కాగా లాక్‌డౌన్‌ నాటికే ప్రభుత్వ చర్యలతో గ్రానైట్‌ క్వారీలు గందరగోళంలో ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత  కుదేలయ్యాయి. సుమారు 20వేల మంది కార్మికులకు ఉపాధి, మరో రెండు వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్థిర రాబడిని ఇచ్చే ఇంచు మించు 1600 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, హోట ళ్లు, ఒక మోస్తరు టర్నోవర్‌ ఉండే పట్టణాల్లోని దుకాణాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 


జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. పనులు లేక పస్తులతో అల్లాడుతున్నారు. జిల్లాలో కరోనా పరిస్థితి చూస్తే పెద్దగా ఉధృ తి లేకపోయినా పూర్తిగా అదుపులోకి అయితే రాలేదు. దీంతో ప్రభుత్వం ప్రక టించిన లాక్‌డౌన్‌ సడలింపులను కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ధైర్యం చేసి అమలు చేయడం లేదు. కీలకశాఖలతో పాటు జిల్లా యంత్రాంగం అంతా లాక్‌డౌన్‌ అమలు, కరోనా నివారణ చర్యలలోనే అలుపు లేకుండా పని చేస్తుండగా అనేకమంది దాతలు అంతో ఇంతో ఆపన్నులకు ఆసరాగా నిలుస్తు న్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిస్థితులు ఎప్పటికి చక్కబతాయన్నది అంతు చిక్కక  ప్రజానీకం ఆందోళన చెందుతోంది. 

Updated Date - 2020-05-24T09:03:35+05:30 IST