మరో 3,503 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-21T08:55:28+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 3,503 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 28 మంది కరోనాతో చనిపోయారు.

మరో 3,503 మందికి కరోనా

ఎనిమిది లక్షలకు చేరువగా కేసులు

కొవిడ్‌తో మరో 28 మంది మృత్యువాత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కొత్తగా 3,503 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 28 మంది కరోనాతో చనిపోయారు. దీంతో బాధితుల సంఖ్య 7,89,553కి, మొత్తం మరణాలు 6,481కి పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 459, తూర్పుగోదావరిలో 457, కృష్ణాలో 398, గుంటూరులో 387 కేసులు నమోదయ్యాయి. 5,144 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 7,49,676కి పెరిగాయి. ప్రస్తుతం 33,396 మంది చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 46,790 మందికి వైరస్‌ సోకిందని, 587 మంది మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 64 శాతం యాక్టివ్‌ కేసులు ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్రం వివరించింది. ఈ రాష్ట్రాల్లో వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న టాప్‌ -5 జిల్లాల (మొత్తం 30) జాబితాను విడుదల చేసింది. వాటిలో మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు న్నాయి.

Updated Date - 2020-10-21T08:55:28+05:30 IST