May 5 2021 @ 00:37AM

పదుకోన్‌ ఫ్యామిలీకి కరోనా

హిందీ కథానాయిక దీపికా పదుకోన్‌ సహా కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు. బెంగళూరులో ఉంటున్న తల్లితండ్రులు సహా సోదరికి కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకోన్‌ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. తల్లి ఉజ్జల, చెల్లెలు అనీషా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. పది రోజుల క్రితం స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా... ముగ్గురికీ కరోనా ఉన్నట్టు తేలిందని ప్రకాశ్‌ స్నేహితుడొకరు చెప్పారు. ఫలితాలు వచ్చిన వెంటనే హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారని అన్నారు. జ్వరం తగ్గకపోవడంతో ప్రకాశ్‌ ఆస్పత్రిలో చేరారనీ, ఈ వారంలో డిశ్చార్జి అవుతారని చెబుతున్నారు.