Abn logo
Sep 25 2020 @ 01:29AM

విజయకాంత్‌కు కరోనా

Kaakateeya

తమిళ రాజకీయ నాయకుడు, నటుడు విజయకాంత్‌కు  కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రతి ఆరు నెలలకు సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఆయనకు అలవాటు. అలా ఈ నెల 22న ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి  వెళ్లినప్పుడు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేయగా, కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయకాంత్‌ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందనీ, త్వరలోనే ఆయన కోలుకొని , డిశ్చార్జి అవుతారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విజయకాంత్‌, నటుడు శరత్‌కుమార్‌ మంచి స్నేహితులు. ఆరు తమిళ చితాల్ర్లో వారిద్దరూ కలసి నటించారు. రాజకీయ పరంగా వారి మార్గాలు వేరయినా, ఒకరంటే మరొకరికి అమిత గౌరవం. విజయకాంత్‌కు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు శరత్‌కుమార్‌. 

Advertisement
Advertisement
Advertisement